Ad Code

ఇసుక రేణువంత చిన్న కెమెరా !


అమెరికాలోని ప్రిన్స్‌టన్ యూనివర్సిటీ, యూనివర్సిటీ ఆఫ్ వాషింగ్టన్‌కు చెందిన పరిశోధకులు సంయుక్తంగా  ఇసుక రేణువంత కెమెరాను తయారుచేశారు. దీన్ని 'మెటాసర్‌ఫేస్' అనే టెక్నాలజీ సాయంతో తయారు చేశారట!. సుమారు 16 లక్షల సిలిండ్రికల్ పోస్టులను కూర్చి ఈ కెమెరా సిద్ధం చేశారు. కంప్యూటర్ చిప్‌లు ఉత్పత్తి చేసినట్లే ఈ కెమెరాను కూడా భారీగా ఉత్పత్తి చేయొచ్చని పరిశోధకులు అంటున్నారు.  మరో గమనించాల్సిన విషయం ఏంటంటే.. ఇంతకు ముందు తయారు చేయడానికి ప్రయత్నించిన మెటాసర్‌ఫేస్‌ కెమెరాలతో పోలిస్తే ఇప్పుడు సిద్ధం చేసిన కెమెరా ఎన్నో రెట్లు స్పష్టమైన ఫొటోలను అందిస్తోంది. వస్తువుల చివర్లు కొంచెం బ్లర్‌ అవడం మినహా దాదాపు సాధారణ కెమెరాతో తీసిన ఫొటోలానే ఉన్నాయీ 'మెటాసర్‌ఫేస్‌' ఫొటోలు. ఈ కెమెరా కన్నా 5 లక్షల రెట్లు పెద్దవైన వస్తువులను కూడా ఈ కెమెరా సులభంగా ఫొటోలు తీసేస్తోందని పరిశోధకులు అంటున్నారు. ఈ కెమెరాను వైద్యరంగంలో ఉపయోగించి ఎన్నో అద్భుతాలు సృష్టించవచ్చని నిపుణులు భావిస్తున్నారు.


Post a Comment

0 Comments

Close Menu