Ad Code

ఎగిరే కారు....!


ఎగిరే కారు ఇది కల కాదు. ఇక ఆ కారులో ఎంచక్కా ఎగురుతూ ప్రయాణించవచ్చు. ఆఫ్రికాకు చెందిన ఫ్రాక్టిల్‌ అనే సంస్థ పక్షి ఆకారంతో వినూత్నంగా ఎగిరే కారును డిజైన్‌ చేసింది. ఇలాంటి కార్లను వర్టికల్‌ టేకాఫ్‌ అండ్‌ ల్యాండింగ్‌ వెహికిల్స్‌ అంటారట. ఎందుకంటే.. ఇవీ నిట్టనిలువునా పైకి ఎగిరిపోతాయట. అయితే, గతంలో ఉన్న వీటీఓఎల్‌నే మార్చినియర్‌ వీటీఓఎల్‌గా కొత్త విమానాలకు పేరు పెట్టింది ఫ్రాక్టిల్‌ సంస్థ. ఎలాగైతే, పక్షి తన కాళ్లతో చెట్టుకొమ్మను పట్టుకుంటుందో.. ఈ విమానమూ నేలపై కొంత ఆధారంతో నిలబడి ఉంటుంది. కొమ్మను బలంగా నొక్కుతూ పైకి ఎగిరే పక్షి మాదిరిగానే ఇది కూడా పైకి ఎగురుతుంది. గాల్లో చేరిన తరువాత కాళ్లు లోనికి ముడుచుకుంటాయి. ఫ్రాక్టిల్‌ తయారు చేసిన ఈ రెక్కల వాహనం పూర్తిగా విద్యుత్‌ సాయంతో నడుస్తుంది. ఇందులో సుమారు 150 కిలోమీటర్ల దూరం ప్రయాణించవచ్చు. రన్‌వే, హెలిపాడ్‌ వంటివేవీ అవసరం లేకుండానే, పైలట్‌ మోడ్‌తోపాటు రిమోట్‌ కంట్రోల్‌ సాయంతోనూ దీన్ని నడపవచ్చు. అత్యవసర పరిస్థితుల్లో గంటకు 180 కిలోమీటర్ల వేగంతో 150 కిలోల బరువు ఉన్న మందులు, సరుకులను మోసుకెళ్లటానికి వీలుగా ఉంటుందని ఫ్రాక్టిల్‌ సంస్థ తెలిపింది.

Post a Comment

0 Comments

Close Menu