Ad Code

క్రోమ్ లో కొత్త ఎక్స్‌టెన్షన్‌లు!


గూగుల్ సంస్థ కొత్తగా క్రోమ్ ఎక్స్​టెన్షన్లను ప్రవేశ పెట్టింది. వీటి ద్వారా పనులను సులభంగా పూర్తి చేసుకోవచ్చని గూగుల్ ప్రకటించింది. క్రోమ్ వెబ్ స్టోర్ నుంచి వీటిని యాక్సెస్ చేసుకోవచ్చు. పర్సనలైజ్డ్ అనుభూతిని అందించే ఈ ఫీచర్లను ఉచితంగా డౌన్​లోడ్ చేసుకునే సదుపాయాన్ని కల్పించింది.  నాలుగు కేటగీరిల్లో ఈ గూగుల్ క్రోమ్ ఎక్స్​టెన్షన్స్ జాబితా చేసింది. కమ్యునికేట్ అండ్ కొలాబరేట్, స్టే ప్రొడక్టివ్, లెర్న్ వర్చువల్లీ, మేక్ సమ్ ఛేంజ్ అనే నాలుగు విభాగాల్లో ఇవి లభిస్తున్నాయి. కమ్యునికేట్ అండ్ కొలాబరేట్ నూతన ఉద్యోగులు, కస్టమర్లకు పని గురించి అవగాహన కల్పించడానికి, వారితో కలిసి పనిచేయడానికి ఉపయోగపడే వీడియో స్క్రీన్, వాయిస్, ఫేస్ రికార్డ్ లాంటి ఫీచర్లు ఈ ఎక్స్​టెన్షన్​లో ఉన్నాయి. దీనిలో  తదుపరి ఎక్స్​టెన్షన్ మోట్. ఇది షేర్ చేసిన పత్రాలు, అసైన్మెంట్​లు, ఈమెయిల్స్, వాయిస్ కామెంట్లు, ఆడియో కంటెంట్​ను జోడించడానికి మీకు సహాయపడుతుంది. ఏవైనా వెబ్​సైట్లు లేదా యాప్​ల నుంచి వాయిస్ నోట్లను కూడా సృష్టించవచ్చు. అంతేకాకుండా మీ వాయిస్ నోట్​ను క్యూఆర్ కోడ్​గా షేర్ చేయవచ్చు. ఈ రోజుల్లో పనిచేస్తున్నప్పుడు, ఇంట్లో చదువుతున్నప్పుడు ఉత్పాదకంగా ఉండటం చాలా ముఖ్యం. ఇందుకోసం గూగుల్ కొన్ని పరిష్కారాలను తీసుకొచ్చింది. ఈ విభాగంలో ముఖ్యమైన ఎక్స్​టెన్షన్ ఫారెస్ట్. ఇది వినియోగదారులను సొంతంగా ప్రేరేపిస్తుంది. వర్చువల్ ట్రీ ప్లాంటింగ్, రివార్డులను ఉపయోగించి మీ ఉత్పాదకతను పెంచుతుంది. గూగుల్ డార్క్ రీడర్ ఈ ఏఢాది గూగుల్ తీసుకొచ్చిన ఎక్స్​టెన్షన్​ల్లో ఒకటి. ఇది మీరు బ్రౌజర్​లో సందర్శించే వెబ్​సైట్​లకు డార్క్ థీమ్​ను వర్తింపజేస్తుంది. ఫలితంగా ఇది కళ్లకు రక్షణ కల్పిస్తుంది. బ్రైట్​నెస్, సెపియా, ఫిల్టర్, డార్క్​మోడ్, ఫాంట్ సెట్టింగ్స్ తదితర మార్పులు ఇందులో చేసుకోవచ్చు. మెరుగైన స్క్రీన్ షాట్, స్క్రీన్ వీడియో రికార్డర్ కోసం చూస్తున్న వారందరికీ గూగుల్ నింబస్ స్క్రీన్ షాట్, స్క్రీన్ వీడియో రికార్డర్​ను తీసుకొచ్చింది. ఇది అత్యుత్తమ స్క్రీన్ షాట్​లను క్యాప్చర్ చేయడం, స్క్రీన్​పై కంటెంట్​ను రికార్డ్ చేయడానికి అనుమతిస్తుంది. వర్చువల్ లెర్నింగ్ ను సులభతరం చేసే కొన్ని యాడ్​ ఆన్​లు ఉన్నాయి. వాటిలో కామీ ముఖ్యమైంది. దీని ద్వారా పీడీఎఫ్, ఇమేజెస్, డాక్యుమెంట్లను ఆన్​లైన్ లెర్నింగ్ ప్రాసెస్​లో ఉపయోగించవచ్చు. అంటే విద్యార్థులు, ఉపాధ్యాయుల మధ్య వర్చువల్ ఇంటరాక్టివ్​ను పెంచుతుంది. దీంతో పాటు గూగుల్ క్లాస్​రూం, కాన్వాస్, స్కూలాజీ, మైక్రోసాఫ్ట్​ టీమ్స్ లాంటి ప్రాధాన్యం కలిగి లెర్నింగ్ మేనేజ్మెంట్ వ్యవస్థలను నెలకొల్పవచ్చు. ఇన్సర్ట్ లెర్నింగ్ అనే మరో ఎక్స్​టెన్షన్ ద్వారా ఉపాధ్యాయుల ప్రశ్నలు, చర్చలు, ఇన్​సైట్స్​ను నేరుగా ఏదైనా వెబ్​సైట్​లోకి చొప్పించవచ్చు. విద్యార్థులు సదరు వెబ్​సైట్​లోకి వెళ్లి ప్రశ్నలకు సమాధానం ఇవ్వవచ్చు. చర్చల్లో పాల్గొనవచ్చు. టీచర్లు ఇచ్చిన కంటెంట్​ను చూస్తూ తమ నోట్స్ కూడా ప్రిపేర్ చేసుకోవచ్చు. భాష నేర్చుకోవడానికి గూగుల్ ఈ ఏడాది టౌకాన్ అనే ఎక్స్​టెన్షన్​ తీసుకొచ్చింది. ఇది మీరు నేర్చుకునేందుకు ప్రయత్నిస్తున్న భాషలో నిర్దిష్ట పదాలు, పదబంధాలను అనువదిస్తుంది. ఇంగ్లీష్, స్పానిష్, ఫ్రెంచ్, జపనీస్, జర్మన్, కొరియన్, హిందీ వంటి భాషల సేకరణతో పని చేస్తుంది.దీంతో పాటు శీఘ్ర అధ్యయనం కోసం రిమెంబర్రీ అనే మరో గూగుల్ ఎక్స్​టెన్షన్ ను తీసుకొచ్చింది. క్రోమ్​ను పర్సనలైజ్ చేసుకోవడానికి గూగుల్ స్టైలస్​ అనే మరో ఎక్స్​టెన్షన్​ను కూడా తీసుకొచ్చింది. మీరు ఎక్కువగా సందర్శించడానికి ఇష్టపడే వెబ్​సైట్​ల కోసం అనుకూల థీమ్, స్క్రీన్​లను రూపొందించడానికి ఇన్​స్టాల్ చేయడానితి ఇది మిమ్మల్ని అనుమతిస్తుంది. ఇది కాకుండా రాకూటెన్ అనే మరో ఫీచర్​తో కూపన్​లు, డెస్క్​లను కనుగొనడంలో మీకు సహాయపడుతుంది. ఆన్​లైన్ షాపింగ్ సమయంలో సహాయం చేస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu