Ad Code

జనవరి నుంచి ఉచితంగా పబ్‌జీ!


జనవరి నుంచి పబ్‌జీ బ్యాటిల్​గ్రౌండ్స్ గేమ్‌ ను  పీసీ, కన్సోల్ గేమర్లకు ఉచితంగా అందిస్తామని  క్రాఫ్టన్‌ వెల్లడించింది. కంప్యూటర్, కన్సోల్ యూజర్లు ఎక్కువగా ఆడే వీడియో గేమ్‌ల్లో పబ్‌జీ బ్యాటిల్​గ్రౌండ్స్ పై వరుసలో ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అయితే ప్రస్తుతానికి కేవలం పెయిడ్ వెర్షన్‌గా మాత్రమే అందుబాటులో ఉన్న పబ్‌జీ: బ్యాటిల్​గ్రౌండ్స్ వచ్చే ఏడాది జనవరి 12 నుంచి ఫ్రీ వెర్షన్‌గా అందుబాటులోకి రానుంది.సౌత్ కొరియన్ గేమింగ్ పబ్లిషర్ క్రాఫ్టన్‌ గేమ్ అవార్డ్స్ 2021 ఈవెంట్‌లో భాగంగా పబ్‌జీ: బ్యాటిల్​గ్రౌండ్స్ ఫ్రీ-టూ-ప్లే గేమ్‌గా మారనుందని వెల్లడించింది. ఉచిత వెర్షన్ అందుబాటులోకి వచ్చాక ఆటగాళ్లకు బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్‌ అనే పెయిడ్ వెర్షన్ కూడా అందుబాటులోకి వస్తుంది. ఉచిత వెర్షన్ బేసిక్ అకౌంట్ అయితే, బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్‌ అనేది ప్రీమియం అకౌంట్. ఒకరకంగా దీన్ని అప్‌గ్రేడ్ వెర్షన్ అని పిలవచ్చు. ఇందులో వివిధ రకాల కొత్త, ప్రత్యేకమైన ఇన్-గేమ్ ఫీచర్లు అందుబాటులో ఉంటాయి. ఒక్కసారి 12.99 డాలర్లు (సుమారు రూ.950) చెల్లిస్తే ఆటగాళ్లు బ్యాటిల్‌గ్రౌండ్స్ ప్లస్‌ ఫీచర్లు యాక్సెస్ చేయవచ్చు. అయితే ఇది కేవలం ఆప్షనల్ అకౌంట్ మాత్రమే. జనవరి 12 నుంచి పీసీ, కన్సోల్ ఆటగాళ్లందరూ డబ్బులు చెల్లించకుండానే బేసిక్ అకౌంట్ ద్వారా గేమ్‌లోని దాదాపు అన్ని ఫీచర్స్ యాక్సెస్ చేయవచ్చు. కొన్ని ప్రత్యేకమైన ఫీచర్ల కోసం మాత్రమే అప్‌గ్రేడ్ చేసుకోవాల్సి ఉంటుంది. అప్‌గ్రేడ్ చేశాక యూజర్లు.. బోనస్ 1,300 జీ- కాయిన్, సర్వైవల్ మాస్టరీ ఎక్స్పీ+ 100 శాతం బూస్ట్‌, కెరీర్-మెడల్ ట్యాబ్, ర్యాంక్ మోడ్, కస్టమ్ మ్యాచ్ ఫంక్షనాలిటీ, టోపీ, క్యామో మాస్క్, కామో గ్లోవ్‌లను కలిగి ఉన్న కెప్టెన్ కామో సెట్‌తో సహా గేమ్‌లోని ఇతర ఫీచర్లకు యాక్సెస్ పొందవచ్చు. గత సంవత్సరం సెప్టెంబర్‌లో, భారత ప్రభుత్వం 118 యాప్‌లను నిషేధించింది. ఇందులో పబ్‌జీ మొబైల్ గేమ్‌ కూడా ఉంది. ఈ గేమ్‌ను పీసీ, కన్సోల్‌లలో మాత్రం బ్యాన్ చేయలేదు.

Post a Comment

0 Comments

Close Menu