Ad Code

శామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A కిడ్స్


ప్రముఖ టెక్ దిగ్గజం శామ్ సంగ్ సంస్థ పిల్లల కోసం కొత్తగా శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A7 లైట్ కిడ్స్ ఎడిషన్‌ను విడుదల చేసింది. దీనిని శామ్సంగ్ గెలాక్సీ ట్యాబ్ A కిడ్స్ అని అంటారు. ఇది పిల్లల కోసం ప్రత్యేకంగా రూపొందించబడింది. శామ్ సంగ్ ఈ టాబ్లెట్ కోసం రష్యన్ పిల్లల బ్రాండ్ స్మేషారికితో జతకట్టింది. శామ్ సంగ్ ప్రకారం ఈ డివైస్ Lego, Riki Group (Smeshariki బ్రాండ్), Toca వంటి ఇతర ప్రముఖ భాగస్వామి బ్రాండ్‌ల కంపెనీల కంటెంట్‌తో ప్రీఇన్‌స్టాల్ చేయబడి ఉంటుంది. ఇందులోని ఆకర్షణీయమైన అప్లికేషన్‌లు పిల్లలకు విశ్రాంతి సమయంలో విద్యాపరంగా నిర్వహించడంలో ఉపయోగకరమైనవిగా సహాయపడతాయి. శామ్ సంగ్ గెలాక్సీ A కిడ్స్ లేదా శామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A కిడ్స్ ఎడిషన్ టాబ్లెట్ రష్యాలో లాంచ్ అయింది. శామ్ సంగ్ గెలాక్సీ ట్యాబ్ A కిడ్స్ యొక్క స్పెసిఫికేషన్స్ విషయానికి వస్తే ఈ ట్యాబ్‌ 8.7-అంగుళాల TFT టచ్‌స్క్రీన్ 1,340×800 పిక్సెల్‌ల రిజల్యూషన్‌తో వస్తుంది. ఇది 2.3GHz ఆక్టా-కోర్ చిప్‌సెట్‌తో ఆధారితంగా మరియు MediaTek Helio P22T ప్రాసెసర్‌తో రన్ అవుతుంది. అలాగే ఇది 3 GB RAM మరియు 32 GB ఇంటర్నల్ స్టోరేజ్ తో జతచేయబడి వస్తుంది. అలాగే మైక్రో SD కార్డ్ ద్వారా మెమొరీని 1TB వరకు విస్తరించవచ్చు. ముఖ్యంగా ఇది బ్లూటూత్ v5.0 కనెక్టివిటీకి మద్దతు ఇచ్చే WiFi-ఓన్లీ ట్యాబ్. శామ్ సంగ్ గ్యాలాక్సీ ట్యాబ్ A కిడ్స్ టాబ్లెట్ పిల్లల కోసం రూపొందించబడిన ప్రత్యేకమైన UIతో వస్తుంది. అలాగే ఇది 20 కంటే ఎక్కువ విద్యాపరమైన గేమ్‌లు మరియు యాప్‌లను కలిగి ఉంటుంది. ఈ ట్యాబ్ యొక్క మరొక గొప్ప ఫీచర్ ఏమిటంటే ఇది తల్లిదండ్రుల నియంత్రణలను అందజేస్తుంది. తల్లిదండ్రులు స్క్రీన్ సమయ పరిమితిని సెట్ చేయడానికి మరియు పిల్లలు యాక్సెస్ చేయగల కంటెంట్‌ను సెట్ చేయడానికి కూడా అనుమతిస్తుంది. అలాగే ఇది డిజిటల్ అసిస్టెంట్‌తో కూడా వస్తుంది. ఇది అడిగినప్పుడు సంగీతం లేదా ఆటను ప్లే చేయగలదు. ట్యాబ్ రక్షణ కోసం మృదువైన, చంకీ రంగుల కవర్‌తో వస్తుంది.వెనుకవైపు 8-మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా మరియు సెల్ఫీల కోసం 2-మెగాపిక్సెల్ కెమెరాను కలిగి ఉంది. Galaxy Tab A Kids 5,100 mAh బ్యాటరీతో అమర్చబడింది మరియు 366 gm బరువు ఉంటుంది. బ్రియో వరల్డ్ గేమ్, పెట్సన్స్ ఇన్వెన్షన్స్, అనేక టోకా బోకా గేమ్‌లు, మూడు కికోరికి గేమ్‌లు మరియు మరిన్నింటితో సహా అనేక గేమ్‌లతో ట్యాబ్ వస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu