Ad Code

మీ హార్ట్ బీట్ రేట్ ఎంత?


కరోనా వైరస్ మహమ్మారి వచ్చినప్పటి నుంచి ప్రజల్లో ఆరోగ్య స్పృహ బాగా పెరిగింది. హెల్త్ టిప్స్ ఎక్కువగా ఫాలో అవుతున్నారు. నిత్యం ఆరోగ్య పరిస్థితిని సమీక్షించుకునే అలవాటు కూడా మొదలైంది. రెగ్యులర్‌గా బీపీ, షుగర్ చెక్ చేసుకుంటూ జాగ్రత్తలు తీసుకుంటున్నారు. పల్స్ ఆక్సీమీటర్, స్మార్ట్‌వాచ్‌లతో హార్ట్ బీట్ రేట్ అప్పుడప్పుడూ చెక్ చేస్తున్నారు. అయితే హార్ట్ రేట్ తెలుసుకోవడానికి పల్స్ ఆక్సీమీటర్, స్మార్ట్‌వాచ్ లాంటివి అవసరం లేదు. మీ స్మార్ట్‌ఫోన్ చాలు. మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫిట్ యాప్ డౌన్‌లోడ్ చేసుకొని హార్ట్ బీట్ రేట్ చాలా సింపుల్‌గా తెలుసుకోవచ్చు. మీ స్మార్ట్‌ఫోన్ కెమెరా సాయంతో రెసిపిరేటరీ, హార్ట్ బీట్ రేట్‌ను తెలుసుకునే ఫీచర్ గూగుల్ ఫిట్ యాప్‌లో ఉంది. రెసిపిరేటరీ, హార్ట్ బీట్ రేట్ పరిశీలించిన ప్రతీసారి వివరాలు సేవ్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్‌ను ఆండ్రాయిడ్ యూజర్ల కోసం చాలారోజుల క్రితమే రూపొందించింది గూగుల్. ఇప్పుడు యాపిల్ ఐఓఎస్ యూజర్లకు ఈ ఫీచర్ రిలీజ్ చేసింది. ఐఫోన్ యూజర్లు యాపిల్ వాచ్ అవసరం లేకుండానే హార్ట్ బీట్ రేట్ తెలుసుకోవచ్చు. ముందుగా మీ స్మార్ట్‌ఫోన్‌లో గూగుల్ ఫిట్ యాప్ డౌన్‌లోడ్ చేయండి. ఆండ్రాయిడ్ యూజర్లు గూగుల్ ప్లేస్టోర్ నుంచి, యాపిల్ యూజర్లు యాప్ స్టోర్ నుంచి డౌన్‌లోడ్ చేయొచ్చు.ఆ తర్వాత గూగుల్ ఫిట్ యాప్ ఓపెన్ చేయండి. మీ జీమెయిల్ ఐడీతో లాగిన్ కావాలి. ఆ తర్వాత హోమ్ స్క్రీన్ పైన Check your heart rate పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత Start measurement పైన క్లిక్ చేయాలి. ఆ తర్వాత మీ స్మార్ట్‌ఫోన్ కెమెరాపైన మీ వేలిని కాసేపు ఉంచాలి. Detecting the pulse in your fingertip అనే మెసేజ్ కనిపిస్తుంది. 30 సెకండ్ల తర్వాత మెజర్‌మెంట్ పూర్తవుతుంది. మీ హార్ట్ రేట్ ఎంతో స్క్రీన్ పైన కనిపిస్తుంది. ఇలా చెక్ చేసిన ప్రతీసారి రికార్డ్ మెయింటైన్ చేయాలనుకుంటే Save measurement క్లిక్ చేసి వివరాలు సేవ్ చేసుకోవచ్చు. పల్స్ ఆక్సీమీటర్, స్మార్ట్‌వాచ్ లాంటివి లేనప్పుడు హార్ట్ రేట్ తెలుసుకోవడానికి గూగుల్ ఫిట్ యాప్ ఉపయోగకరంగా ఉంటుంది. స్మార్ట్‌ఫోన్ యూజర్లు తమ ఫిట్‌నెస్ ట్రాకింగ్ కోసం గూగుల్ ఫిట్ యాప్ ఉపయోగించుకోవచ్చు. 

Post a Comment

0 Comments

Close Menu