Ad Code

మీ ఫేస్​బుక్​ అకౌంట్​ లాక్ అయిందా ?


ఫేస్​బుక్​ కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లు ఆకట్టుకుంటోంది. ఇప్పటికే, సోషల్​ మీడియాలో టాప్​ ప్లేస్​లో ఉన్న ఫేస్​బుక్​.. ఇప్పుడు మరింత మంది యూజర్లను చేర్చుకునేలా ప్రణాళికలు రచిస్తోంది. ఇందులో భాగంగా యూత్​ను టార్గెట్ చేస్తూ వరుసగా ఫీచర్లు విడుదల చేస్తోంది.  తాజాగా, ఫేస్​బుక్​ తన వినియోగదారుల కోసం ఓ కొత్త ఫీచర్​ను అందుబాటులోకి తెచ్చింది. గతంలో లాక్​ చేసిన ఖాతాలను తిరిగి తెరవాలనుకునే యూజర్ల కోసం లైవ్​ చాట్​ ఫీచర్​ను ప్రకటించింది. ప్రస్తుతం ఫేస్​బుక్​ ఖాతాలను యాక్సెస్​ చేయలేని వారు.. తమ బ్లాక్​ అయిన ఖాతాలను తిరిగి యూజర్లు పొందేందుకు ఈ లైవ్​ చాట్​ ఫీచర్​ను ఫేస్​బుక్​ అందుబాటులోకి తెచ్చింది. దీంతో ఆయా యూజర్లు తమ ఖాతాలను తిరిగి ప్రారంభించడం సులభమవుతుంది. లైవ్​ చాట్ సపోర్ట్​ కేవలం ఇంగ్లీష్​లోనే అందుబాటులో ఉంటుందని ఫేస్​బుక్​ తెలిపింది. ఫేస్​బుక్​ సపోర్ట్​పై క్లిక్​ చేస్తే సంస్థకు చెందిన కస్టమర్ ఎగ్జిక్యూటివ్​తో యూజర్లు చాట్ చేయవచ్చని తెలిపింది. అయితే ప్రస్తుతానికి టెస్టింగ్​ దశలోనే ఉన్న ఈ ఫీచర్​ యునైటెడ్​ స్టేట్స్​లో మాత్రమే​ అందుబాటులోకి వచ్చింది. త్వరలోనే ఇతర దేశాలకు కూడా అందుబాటులోకి తెస్తామని ఫేస్​బుక్​ ప్రకటించింది. ఫేస్​బుక్​ ఖాతాలకు ఇలా లైవ్​ చాట్ అవకాశాన్ని కల్పించడం ఇదే మొదటిసారి. ఇప్పటివరకు ఫేస్​బుక్​లోని యూజర్​ సపోర్ట్​ టీమ్​ను సంప్రదించి, వారి ఖాతా ఎందుకు సస్పెండ్​ అయిందో తెలుసుకునే అవకాశం లేదు. అయితే ఈ కొత్త లైవ్​ 'ఫేస్​బుక్​ సపోర్ట్​' చాట్​ బాక్స్ ఫీచర్​​ ద్వారా వినియోగదారులు కస్టమర్ సపోర్ట్ ఎగ్జిక్యూటివ్​తో మాట్లాడి తమ ఖాతాలను తిరిగి పొందే అవకాశం లభిస్తుంది. సాధారణ ఫేబ్​బుక్​ యూజర్లతో పాటు కంటెంట్​ క్రియేటర్స్​కు కూడా ఈ ఫీచర్​ అందుబాటులో ఉంటుంది. తద్వారా వారు ఫేస్​బుక్​తో సులభంగా కనెక్ట్ అవ్వొచ్చు. ఫేస్​బుక్​ ప్రమాణాలను ఉల్లంఘించిన కారణంగా సస్పెండ్ అయన ఖాతాలను తిరిగి తెరిచేందుకు ఈ కొత్త ఫీచర్​ ఉపయోగపడుతుంది. ''ప్రత్యేకంగా ఫేస్‌బుక్ యాప్‌లో ఇంగ్లీష్​ మాట్లాడే వినియోగదారుల కోసం ఈ లైవ్​ ఛాట్​ ఫీచర్​ను పరీక్షించడం ప్రారంభించాం. ప్రస్తుతం ఇది టెస్టింగ్ దశలోనే ఉంది. త్వరలోనే అందుబాటులోకి రానుంది." అని కంపెనీ ఒక ప్రకటనలో తెలిపింది.ఫేస్​బుక్​ లైవ్​ చాట్​తో పాటు లైవ్​ కంటెంట్​ మోడరేషన్​ టూల్​ను కూడా అందుబాటులోకి తెస్తుంది. దీని ద్వారా యూజర్లు నిర్ధిష్ట పదాలను బ్లాక్​ చేయవచ్చు. దీంతోపాటు మరిన్ని ప్రైవసీ ఫీచర్లను సైతం త్వరలో అందుబాటులోకి తీసుకురానున్నట్లు సంస్థ ప్రతినిధులు తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu