Ad Code

మార్కెట్లోకి రానున్నవివో ట్యాబ్లేట్



వివో మొదటిసారిగా ట్యాబ్లేట్ తీసుకువస్తున్నట్లు ప్రకటించింది. వాస్తావనికి, ఈ సంవత్సరం ఆరంభం లోనే వివో సంస్థ యూరోపియన్ యూనియన్ ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ ఆఫీస్ తో నవివో ప్యాడ్ని ట్రేడ్ మార్క్ చేసింది. కంపెనీ దృవీకరించినట్లుగా 2022 సంవత్సరం అర్ధభాగంలో ఈ వివో ట్యాబ్లేట్ మార్కెట్లో అడుగుపెడుతుంది. అయితే, ఇప్పటి వరకూ ఈ ట్యాబ్ గురించి ఎటువంటి వివరాలు తెలియనప్పటికీ ఇప్పుడు కొత్తగా వచ్చిన ఒక లీక్ ఈ టాబ్లెట్ Qualcomm చిప్సెట్ శక్తితో పనిచేస్తుందని చెబుతోంది. ఈ అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ గురించి ప్రముఖ టిప్ స్టర్ డిజిటల్ స్టేషన్ కొన్ని వివరాలను వెల్లడించింది. దీని ప్రకారం, అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ Snapdragon 870 ప్రోసెసర్ తో వస్తుందని వెల్లడించింది. ఈ ప్రోసెసర్ తో X60 ప్రో మరియు iQOO 7 వంటి కొన్ని ప్రీమియం స్మార్ట్ ఫోన్లను ఇప్పటికే వివో మార్కెట్లోకి తీసుకువచ్చింది. ఇదే కనుక నిజమైతే వివో ట్యాబ్లేట్ చాల వేగంగా పని చెయ్యగలదని ఖచ్చితంగా చెప్పొచ్చు.మరిన్ని లీక్డ్ వివరాల్లోకి వెళితే, ఈ అప్ కమింగ్ వివో ట్యాబ్లేట్ TUV Rheinland సర్టిఫికేషన్ వెబ్సైట్ లో కూడా కనిపించినట్లు తెలుస్తోంది. అంతేకాదు, 8040mAh హెవీ బ్యాటరీని కూడా కలిగి ఉన్నట్లు వెల్లడించింది. 

Post a Comment

0 Comments

Close Menu