Ad Code

కొత్త సంత్సరంలో విడుదల కానున్న టాప్ స్మార్ట్‌ఫోన్లు


స్మార్ట్‌ఫోన్ తయారీ కంపెనీలు ఎప్పటికప్పుడు కొత్త మోడళ్లతో కస్టమర్లను ఆకర్షిస్తున్నాయి. అందుబాటులోకి వస్తున్న కొత్త టెక్నాలజీతో వివిధ రకాల వేరియంట్లను లాంచ్ చేస్తున్నాయి. మహమ్మారి కారణంగా గత ఏడాది స్మార్ట్‌ఫోన్ మార్కెట్ తిరోగమనంలో ఉన్నప్పటికీ, ఈ ఏడాది మాత్రం పరిస్థితులు మారాయి. తయారీదారులు 2021లో వేగం పుంజుకున్నారు. ఇప్పటికే శామ్‌సంగ్ నుంచి గెలాక్సీ Z ఫోల్డ్ 3, గెలాక్సీ Z ఫ్లిప్ 3 వంటి కొన్ని అద్భుతమైన స్మార్ట్‌ఫోన్‌లను లాంచ్ అయ్యాయి. ఈ నేపథ్యంలో కొత్త సంత్సరంలో భారత్‌లో విడుదల కానున్న టాప్ డివైజ్‌లు: శామ్ సంగ్ గెలాక్సీ S21 సిరీస్‌లో లభించే అత్యంత ప్రీమియం మోడల్ 'అల్ట్రా'. గెలాక్సీ S21 ఆల్ట్రా ధర రూ.1,05,999గా ఉంది. ఈ సిరీస్‌లో 2022లో రానున్న మరో మోడల్ గెలాక్సీ S22 అల్ట్రా. ఇది సరికొత్త స్నాప్‌డ్రాగన్, ఎక్సినోస్ హార్డ్‌వేర్, యాక్సెసరీలు, కొత్త కెమెరా సెటప్‌తో వస్తుందని భావిస్తున్నారు. గెలాక్సీ S22 ఆల్ట్రాలో S పెన్ కోసం స్పెషల్ స్లాట్‌ ఉన్నట్లు తెలుస్తోంది. గెలాక్సీ S20 FE ధర రూ.40,790గా ఉంది. ఇది IP68 రేటింగ్, AMOLED డిస్‌ప్లే, ప్రీమియం కెమెరాల పనితీరుతో ఆకట్టుకుంది. ఇప్పుడు గెలాక్సీ S21 FE ఫోన్‌ను సంస్థ అభివృద్ధి చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి. S21 FE మోడల్‌ లాంచింగ్ గురించి శామ్సంగ్ 2022 జనవరిలో ప్రకటించవచ్చు. పెద్ద స్క్రీన్ ఉండే ఐఫోన్ 14 మ్యాక్స్‌ను యాపిల్ అభివృద్ధి చేస్తోంది. ఇది 2022లో లాంచ్ కానుంది. దీని రిలీజ్‌కు అనుకూలంగా ఐఫోన్ 14 మినీని తమ సేల్స్ లిస్ట్ నుంచి సంస్థ తొలగించవచ్చని తెలుస్తోంది. అన్ని ఐఫోన్ 14 మోడల్‌లు 120Hz LTPO డిస్‌ప్లేలను కలిగి ఉండవచ్చని నివేదికలు సూచిస్తున్నాయి. ఐఫోన్ 14 ప్రో, ప్రో మాక్స్ మోడల్‌లు హోల్-పంచ్ డిస్‌ప్లే, ఇన్-డిస్‌ప్లే ఫింగర్‌ప్రింట్ రీడర్‌లను కలిగి ఉన్నాయనే వార్తలు వచ్చాయి. యాపిల్ ఐఫోన్ SE 3 లేదా ఐఫోన్ SE 5G పేరుతో కొత్త డివైజ్‌ను తయారు చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇది 2022 మధ్యలో లాంచ్ అయ్యే అవకాశం ఉంది. టచ్ ఐడికి బదులుగా ఫేస్ ఐడిని ఉపయోగించే మొదటి SE మోడల్ ఐఫోన్ SE 3 అవుతుందని ఒక నివేదిక సూచిస్తుంది. వన్ ప్లస్ సంస్థ ఇప్పటికే 9 ప్రో మోడల్తో మంచి డిజైన్‌ను, కొన్ని కెమెరా అప్‌గ్రేడ్‌లను అందించింది. త్వరలో రానున్న వన్‌ప్లస్ 10 ప్రో సైతం ప్రీమియం ఫీచర్లతో కస్టమర్లను ఆకట్టుకోనుంది. ఇది క్వాల్‌కామ్ స్నాప్‌డ్రాగన్ 8 Gen 1 ప్రాసెసర్‌తో వస్తుంది. 120Hz రిఫ్రెష్ రేట్‌తో 6.7 అంగుళాల LTPO ఫ్లూయిడ్ 2 AMOLED డిస్‌ప్లేను కలిగి ఉంటుంది. వచ్చే ఏడాది ప్రారంభంలో ఈ ఫోన్‌ను విడుదల చేయనున్నారు. షియోమి 12 ఫోన్ డిసెంబర్ 28న లాంచ్ అవుతుందని సమాచారం. 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, అల్ట్రా-వైడ్ యాంగిల్ కెమెరా, టెలిఫోటో కెమెరాతో రియర్ కెమెరా సెటప్ దీంట్లో ఉంది. ఫోన్ షియోమి 12X, 12, 12 ప్రో వంటి మూడు మోడళ్లలో వస్తుంది. వీటితో పాటు గూగుల్ పిక్సెల్ 6a, ఒప్పో ఫైండ్ N స్మార్ట్‌ఫోన్లు కూడా 2022లో లాంచ్ అవుతాయని మార్కెట్ వర్గాలు విశ్లేషిస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu