Ad Code

తక్కువ ధరకు వచ్చే ఎలక్ట్రిక్ కార్లు


భారత్ లో ఎలక్ట్రిక్ కార్ల విప్లవం మొదలైందని చెప్పవచ్చు.  ఓవైపు పెట్రోల్, డీజిల్ ధరలు పెరుగుతుండటం, మరోవైపు పర్యావరణ కాలుష్యంతో వాహనదారుల చూపు ఎలక్ట్రిక్ వాహనాలపై పడింది. వీటిపై కేంద్ర ప్రభుత్వం రాయితీలు అందిస్తుండటం కూడా కలిసొచ్చే అంశంగా చెప్పవచ్చు. మార్కెట్లో పెరుగుతున్న డిమాండ్ దృష్ట్యా ప్రముఖ వాహన తయారీ సంస్థలతో పాటు స్టార్టప్ సంస్థలు కూడా ఈ రంగంలోకి ప్రవేశిస్తున్నాయి. అయితే వీటిలో చాలా వరకు ఖరీదైనవిగా ఉన్నాయి. కానీ, కొన్ని మాత్రం తక్కువ ధరకే లభిస్తున్నాయి. 

టాటా టిగోర్ ఈవీ : భారత మార్కెట్లో రెండు ఎలక్ట్రిక్ కార్లను విక్రయిస్తోన్న ఏకైక బ్రాండ్ గా టాటా మోటార్స్ నిలిచింది. ఈ బ్రాండ్ నుంచి విడుదలైన టిగోర్ ఎలక్ట్రిక్ సబ్-ఫోర్-మీటర్ కాంపాక్ట్ సెడాన్ రూ. 11.99 లక్షల ప్రారంభ ధర వద్ద లభిస్తుంది. ఇది మొత్తం మూడు వేరియంట్లలో అందుబాటులో ఉంటుంది. దీని టాప్-స్పెక్ మోడల్ రూ. 12.99 వద్ద లభిస్తుంది. ఇది 306 కి.మీ. ఎలక్ట్రిక్ రేంజ్‌తో అత్యంత సరసమైన ఈవీగా ప్రసిద్దికెక్కింది.

టాటా నెక్సాన్ ఈవీ : టాటా మోటార్స్ విక్రయిస్తోన్న మరో ఎలక్ట్రిక్ మోడల్ నెక్సాన్ ఈవీ. ఇది భారత మార్కెట్లో అత్యంత సరసమైన ఎలక్ట్రిక్ ఎస్యూవీగా ప్రసిద్ది చెందింది. దీని సమీప ప్రత్యర్థి ఎంజీ ZS ఈవీ కంటే దాదాపు రూ. 6 నుంచి రూ. 7 లక్షల వరకు తక్కువ ధరకే లభిస్తుంది. టాటా నెక్సాన్ ఈవీ 30.2 kWh బ్యాటరీతో వస్తుంది. దీన్ని ఒక్కసారి ఛార్జ్ చేస్తే 312 కిమీల పరిధిని అందిస్తుంది. ఇది 129 పీఎస్ పవర్, 245Nm టార్క్‌ని ఉత్పత్తి చేస్తుంది. దీని ముందు భాగంలో పర్మనెంట్ మాగ్నెట్ సింక్రోనస్ మోటార్‌ను కూడా అమర్చింది.

ఎంజీ జెడ్ఎస్ ఈవీ : జెడ్ఎస్ ఈవీ భారతదేశంలో ఎంజీ నుంచి విడుదలైన రెండో ఎలక్ట్రిక్ కారు. దీనిలోని ఫీచర్లు విదేశాలలో విక్రయించే ఎంజీ జెడ్ఎస్ పెట్రోల్ వేరియంట్ను పోలి ఉంటాయి. జెడ్ఎస్ ఈవీ 44.5kWh బ్యాటరీతో వస్తుంది. దీనిలో లిక్విడ్-కూల్డ్ లిథియం- అయాన్ బ్యాటరీని అమర్చింది. ఎంజీ గరిష్టంగా 340కి.మీల డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది. ఈ ఎంజీ జెడ్ఎస్ ఈవీ 143bhp, 353Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. ఇది కేవలం 8.5 సెకన్లలో 100kmph స్పీడ్ అందుకోగలదు.

హ్యుందాయ్ కోనా ఎలక్ట్రిక్ : హ్యుందాయ్ నుంచి భారత మార్కెట్లోకి విడుదలైన మొట్టమొదటి ఎలక్ట్రిక్ ఎస్యూవీ కోనా ఎలక్ట్రిక్. ఇది ప్రపంచవ్యాప్తంగా అత్యంత ప్రజాదరణ పొందిన ఈవీగా రికార్డు సాధించింది. ఈ జాబితాలో పేర్కొన్న అన్ని ఈవీల కంటే కోనా చాలా ఖరీదైనది. అయితే, ధరకు తగ్గట్లే దీనిలో ప్రీమియం ఫీచర్లను అందించింది. కోనా ఎలక్ట్రిక్ 39.2 కిలోవాట్ లిథియం- అయాన్ పాలిమర్ బ్యాటరీ ప్యాక్‌తో వస్తుంది. ఇది 452 కి.మీ. డ్రైవింగ్ పరిధిని అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu