Ad Code

బిఎస్ఎన్ఎల్ చౌక రీఛార్జ్ ప్లాన్లు


ఒకవైపు ప్రైవేట్ టెలికం సంస్థల రీఛార్జ్ ధరలు ఆకాశాన్ని అంటుతుంటే, ప్రభుత్వ టెలికం సంస్థ బిఎస్ఎన్ఎల్  మాత్రం నామ మాత్రపు ధరలకే రీఛార్జ్ ప్లాన్ లను అఫర్ చేస్తోంది. ముఖ్యంగా లాంగ్ వ్యాలిడిటీ కోరుకునేవారికి మార్కెట్లో ఆల్ టైం బెస్ట్ ప్లాన్స్ ను కూడా ఆఫర్ చేస్తోంది. ఇందులో అతి చౌక ధరలో ప్రకటించిన రూ.599 రూపాయల రీఛార్జ్ ప్లాన్ గురించి చెపుకోవచ్చు. బిఎస్ఎన్ఎల్  599 STV ప్లాన్ గా పిలువబడుతుంది. ఈ ప్లాన్ కస్టమర్లకు అధిక లాభాలను అందించే వాటిలో బెస్ట్ ప్లాన్ గా నిలుస్తుంది. ఈ ప్లాన్ 85 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. ఈ పూర్తి వ్యాలిడిటీ కాలానికి గాను డైలీ 5GB హై సీడ్ డేటా మరియు అన్ని నెట్ వర్క్ లకు అన్ లిమిటెడ్ కాలింగ్ ను కూడా ఆఫర్ చేస్తుంది. అలాగే, 85 రోజులకు డైలీ 100 ఉచిత SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, Zing App కి ఉచిత సబ్ స్క్రిప్షన్ ను కూడా అందిస్తుంది. మరిన్ని బెస్ట్ ప్రీపెయిడ్ ప్లాన్స్ గురించి చూస్తే, కేవలం 500 రూపాయల బడ్జెట్ లో అన్లిమిటెడ్ ప్రయోజాలను అఫర్ చేసే బెస్ట్ ప్లాన్స్ కూడా చాలానే వున్నాయి. వాటిలో బెస్ట్ ప్లాన్స్ ఈ క్రింద చూడవచ్చు. బిఎస్ఎన్ఎల్ రూ.199 అన్లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 60GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్ వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తి నెల మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 30 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది.  రూ.249 అన్ లిమిటెడ్ ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 60 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. రూ.397 అన్లిమిటెడ్ ప్లాన్ 10 నెలల (300 రోజులు) వ్యాలిడిటీ తో వస్తుంది మరియు డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 120GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా రెండు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ యొక్క ఉచిత లాభాలు కేవలం 60 రోజులకే వర్తిస్తాయి. రూ.499 STV ప్లాన్ డైలీ 2GB హై స్పీడ్ డేటాతో మొత్తంగా 180GB డేటాని అందిస్తుంది. అన్ని నెట్వర్కులకు అన్లిమిటెడ్ కాలింగ్ ని పూర్తిగా మూడు నెలలు మొత్తం చేసుకోవచ్చు. ఈ ప్లాన్ 90 రోజుల వ్యాలిడిటీ తో వస్తుంది మరియు రోజుకు 100 SMS లను కూడా తీసుకువస్తుంది. అదనంగా, ఫ్రీ కాలర్ ట్యూన్ మరియు ఉచిత Zing యాప్ యాక్సెస్ కూడా అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu