Ad Code

యాడ్స్ లో డిజిటల్ రంగం దూకుడు..!


పేపర్, టీవీ లలో కూడా చాలా మార్పులు చోటుచేసుకున్నాయి. తరువాత మొబైల్, స్మార్ట్ టీవీ, ఆండ్రాయిడ్ టీవీ ఇలా ఎన్నో సాంకేతికతల అందుబాటులోకి వచ్చాయి. వాటి మధ్య ఎన్నో పాత వ్యవస్థలు నలిగిపోయిన విషయం తెలిసిందే. అదంతా సహజం మీడియా రంగంలో కూడా అనేక మార్పులు వచ్చేశాయి. ఒక ఛానల్ బాగా వృద్ధిలోకి రావాలి అంటే ముందు దానికంటే చిన్న వాటిని తొక్కేయాలి, అనంతరం తన వృద్దికోసం కృషి పెద్దగా చేయాల్సిన పని ఉండదు అనేది ప్రస్తుతం ఎదుగుదలలో ఫాలో అవుతున్న నీతి. అది ఒక్క మీడియా తో పోలేదు, ప్రతి వ్యవస్థలో కూడా ఉంది. కానీ వీళ్లంతా దాదాపుగా ఏకఛత్రాధిపత్యం కోసం తీవ్రంగా ప్రయత్నిస్తూనే ఉంటారు. అందులో చిన్నవాళ్లు కనిపించకుండా పోతూనే ఉంటారు. ఇక సామజిక మాధ్యమాల పరిస్థితి చూసినా అంతే ఉంది. మేము ముందు అంటే మేము ముందు అంటూ అసలు విలువలు మరిచిపోయి, కేవలం రాకింగ్ కు ప్రాధాన్యత ఇస్తూ పోతున్నారు. ప్రకటనల విషయంలో కూడా ఇదే తరహా కాంపిటీషన్ కనిపిస్తుంది. దండుకున్నోడికి దండుకున్నంత అన్నట్టుగా విపరీతంగా ప్రకటనలు వస్తున్నాయి. అసలు విషయం కంటే అవే ఎక్కువగా ఉంటున్నాయి. ప్రకటనలో ప్రస్తుతం ఫేస్ బుక్(41%) మొదటి స్థానంలో ఉంటె, గూగుల్(21%) రెండో స్థానంలో కొనసాగుతుంది. వీళ్ళ వలన బాగా నష్టపోయిన వారిలో పెద్ద పెద్ద సంస్థలు కూడా ఉన్నాయి, ప్రింట్, టీవీ, రేడియో, రోడ్, స్టార్ ఇండియా, సోనీ, సన్ టీవీ, టీవీ 18, టైమ్స్ ఇండియా లు బాగా ఆదాయాన్ని కోల్పోయాయి. ఈ భారతీయ సంస్థలు 29-21 వేల కోట్ల స్థాయికి పడిపోయింది. ఫేస్ బుక్ మరియు గూగుల్ సంస్థలకు యాడ్స్ పైనే 23215కోట్ల ఆదాయం ఆర్జించాయి. గత ఏడాదితో పోల్చుకుంటే ఈ ఏడాది 29శాతం ఎక్కువ. దీనినిబట్టి  డిజిటల్ రంగం ఎంత దూకుడుగా ముందుకు వెళుతుందో అర్థమవుతుంది. 

Post a Comment

0 Comments

Close Menu