Ad Code

రూ.20 వేల లోపే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ !


ప్రీమియం స్మార్ట్‌ఫోన్ల విషయంలో యాపిల్ తర్వాత వన్‌ప్లస్ కొనేవారి సంఖ్య పెరిగిపోయింది. గతంలో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలంటే సుమారు రూ.40,000 వరకు ఖర్చు చేయాల్సి వచ్చేది. ఆ తర్వాత వన్‌ప్లస్ కాస్త తక్కువ బడ్జెట్‌లో స్మార్ట్‌ఫోన్లను పరిచయం చేయడం మొదలుపెట్టింది. అందులో భాగంగా నార్డ్ సిరీస్‌ను రిలీజ్ చేసింది. 2020 లో వన్‌ప్లస్ నార్డ్ మొబైల్‌ను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నార్డ్ 2, వన్‌ప్లస్ నార్డ్ సీఈ మోడల్స్‌ను రిలీజ్ చేసింది. వన్‌ప్లస్ నెంబర్ సిరీస్ కన్నా నార్డ్ సిరీస్ స్మార్ట్‌ఫోన్ల ధర తక్కువ. కేవలం రూ.30 వేల  లోపే నార్డ్ స్మార్ట్‌ఫోన్లను వన్‌ప్లస్ పరిచయం చేస్తోంది. త్వరలో వన్‌ప్లస్ నుంచి రూ.20 వేల   లోపు స్మార్ట్‌ఫోన్ రాబోతోంది. ప్రస్తుతం వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.22,999గా ఉన్నది. వన్‌ప్లస్ నార్డ్ 2 స్మార్ట్‌ఫోన్ ప్రారంభ ధర రూ.27,999. తక్కువ బడ్జెట్‌లోనే వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ కొనాలనుకునేవారికి ఇవి బెస్ట్ ఆప్షన్స్‌గా ఉంటున్నాయి. అయితే రూ.20,000 లోపు సెగ్మెంట్‌లో కూడా అడుగుపెట్టే ఆలోచనలో వన్‌ప్లస్ ఉన్నట్టు తాజాగా వార్తలొస్తున్నాయి. ఈ బడ్జెట్‌లో కూడా నార్డ్ సిరీస్‌లోనే స్మార్ట్‌ఫోన్ రానుంది. వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్ ఏప్రిల్ నుంచి జూన్ మధ్య రిలీజ్ అయ్యే అవకాశం ఉంది. వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో 90Hz డిస్‌ప్లే, 50 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా, 5జీ కనెక్టివిటీ లాంటి ఫీచర్స్ ఉండే అవకాశం ఉంది. వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్లలో ఎక్కువగా స్నాప్‌డ్రాగన్ ప్రాసెసర్‌తో వస్తుంటాయి. కానీ వన్‌ప్లస్ నార్డ్ 3 స్మార్ట్‌ఫోన్‌లో మీడియాటెక్ ప్రాసెసర్ ఉండొచ్చని అంచనా. మరోవైపు ఇప్పటికే వన్‌ప్లస్ నార్డ్ సీఈ స్మార్ట్‌ఫోన్ ఉన్న సంగతి తెలిసిందే. వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ స్మార్ట్‌ఫోన్ కూడా రాబోతుందన్న వార్తలు కూడా గతంలో వచ్చాయి. వస్తున్న వార్తలు నిజం అయితే ఈ ఏడాది వన్‌ప్లస్ నార్డ్ సిరీస్‌లో మూడు స్మార్ట్‌ఫోన్లు లాంఛ్ అయ్యే అవకాశం ఉంది. ఇంకొన్ని రోజుల్లో వన్‌ప్లస్ నార్డ్ 3, వన్‌ప్లస్ నార్డ్ 2 సీఈ 5జీ మోడల్స్‌తో పాటు రూ.20 వేల లోపు మరో వన్‌ప్లస్ స్మార్ట్‌ఫోన్ రావొచ్చు. వన్‌ప్లస్ రూ.20 వేల లోపు రిలీజ్ చేయబోయే స్మార్ట్‌ఫోన్‌లో ఫీచర్స్ వన్‌ప్లస్ నార్డ్ సీఈ మొబైల్‌లో లాగానే ఉండొచ్చన్న చర్చ జరుగుతోంది. వన్‌ప్లస్ నార్డ్ బడ్జెట్ స్మార్ట్‌ఫోన్‌లో 6.4 అంగుళాల ఫుల్ హెచ్‌డీ+ డిస్‌ప్లే, మీడియాటెక్ డైమెన్సిటీ 900 ప్రాసెసర్, 12 జీబీ వరకు ర్యామ్, 256జీబీ వరకు ఇంటర్నల్ స్టోరేజ్, 4,500ఎంఏహెచ్ బ్యాటరీ, 65వాట్ ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్, 64 మెగాపిక్సెల్ ప్రైమరీ కెమెరా + 2 మెగాపిక్సెల్ మ్యాక్రో కెమెరా + 8 మెగాపిక్సెల్ అల్‌ట్రావైడ్ కెమెరా లాంటి ఫీచర్స్ ఉండొచ్చని అంచనా.  

Post a Comment

0 Comments

Close Menu