Ad Code

నేతాజీ 3D హోలోగ్రామ్ విగ్రహావిష్కరణ !


ఇండియా గేట్ వద్ద నేతాజీ సుభాష్ చంద్రబోస్ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఆదివారం ప్రధాని నరేంద్ర మోదీ ప్రారంభించారు. నేతాజీ 125వ జయంతిని పురస్కరించుకుని ఈ విగ్రహాన్ని ఆవిష్కరించారు. అదే ప్రదేశంలో గ్రానైట్ విగ్రహాన్ని ఏర్పాటు చేసే వరకు నేతాజీ హోలోగ్రామ్ విగ్రహాన్ని ఉంచుతామని ప్రధాని మోదీ ప్రసంగంలో తెలిపారు. గ్రానైట్ విగ్రహం ఎప్పుడు నిర్మించబడి ఏర్పాటు చేస్తోరో అన్న నిర్దిష్ట తేదికి సంబందించిన వివరాలను వెల్లడించలేదు. హోలోగ్రామ్‌లు అనేవి నిజమైన భౌతిక వస్తువులను ప్రతిబింబించే కాంతి కిరణాల జోక్యం సహాయంతో సృష్టించబడిన వర్చువల్ 3D చిత్రాలు. సుభాష్ చంద్రబోస్ యొక్క హోలోగ్రామ్ విగ్రహాన్ని ఏర్పాటు చేయడం వెనుక ఉన్న ప్రధాన ఆలోచన విషయానికి వస్తే హోలోగ్రామ్ యొక్క చిత్రాన్ని వాస్తవికంగా మరియు అన్ని వైపుల నుండి కనిపించే విధంగా ప్రొజెక్ట్ చేయడం. హోలోగ్రామ్ చూడడానికి  తప్పనిసరిగా దాని చుట్టూ నడవాలి. కొత్తగా ఏర్పాటు చేసిన నేతాజీ హోలోగ్రామ్ 30,000 ల్యూమెన్స్ 4K ప్రొజెక్టర్ ద్వారా శక్తిని పొందుతుంది. ఇది గ్రానైట్ విగ్రహాన్ని పూర్తిగా అభివృద్ధి చేసే వరకు అందుబాటులో ఉంచబడుతుంది. సందర్శకులకు అన్ని సమయాలలో కనిపించే విధంగా "90 శాతం పారదర్శక" హోలోగ్రాఫిక్ స్క్రీన్‌ను ఏర్పాటు చేసినట్లు సాంస్కృతిక మంత్రిత్వ శాఖ అధికారులు తెలిపారు. "ఇండియా గేట్ వద్ద కొత్తగా ఏర్పాటు చేసిన నేతాజీ సుభాష్ చంద్రబోస్ యొక్క హోలోగ్రామ్ విగ్రహం 28×6 అడుగుల పరిమాణంలో ఉంటుంది. గ్రానైట్ విగ్రహం లాగానే ఇది కనిపిస్తుంది. అంతేకాకుండా అసలు విగ్రహం వచ్చే వరకు ప్రతిరోజూ సూర్యాస్తమయం నుండి సూర్యోదయం వరకు ప్రకాశిస్తూనే ఉంటుంది" అని ఒక అధికారి తెలిపారు. ఈ విగ్రహం యొక్క గ్రాఫిక్ నమూనాను నేషనల్ గ్యాలరీ ఆఫ్ మోడరన్ ఆర్ట్ డైరెక్టర్ జనరల్ అద్వైత గదానాయక్ ఆధ్వర్యంలోని బృందం రూపొందించింది.

Post a Comment

0 Comments

Close Menu