Ad Code

రాయల్ ఎన్‌ఫీల్డ్ ధర పెంపు ?



చెన్నైకి చెందిన గ్లోబల్ సప్లయ్ చైన్ కంపెనీ పెరిగిన ఇన్‌ఫుట్ ఖర్చులు, ముడి పదార్థాల బిల్లులు భారీగా పెరగడంతో రాయల్ ఎన్ ఫీల్డ్ ధరలను పెంచాలని నిర్ణయించింది. Classic 350, Meteor 350, Himalayan motorcycles వంటి రాయల్ ఎన్‌ఫీల్డ్ మోడళ్లకు అత్యధికంగా డిమాండ్ ఉన్న సంగతి తెలిసిందే. ఈ మోటార్‌ సైకిళ్లను కొత్త ధర కేటగిరీ కిందకు చేర్చింది. అయితే.. ఇంటర్‌సెప్టర్, Continental GT బుల్లెట్ ధరలు మాత్రం మారలేదు. రాయల్ ఎన్‌ఫీల్డ్ హిమాలయన్ రేంజ్ అన్ని బైక్‌ల ధరలు రూ. 4,000 కంటే ఎక్కువగా పెరిగాయి. సిల్వర్ యాష్ రంగు హిమాలయన్ బైక్ ధర ఇప్పుడు రూ. 2.14 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. నలుపు, ఆకుపచ్చ హిమాలయన్ బైక్ ధర రూ. 2.22 లక్షల (ఎక్స్-షోరూమ్)కు పెరిగింది. క్లాసిక్ 350 రేంజ్ బైక్‌ వేరియంట బైకులపై వరుసగా రూ. 2,872, రూ.3,332 ధరలు పెరిగాయి. ట్రీ-లెవల్ Redditch క్లాసిక్ 350 ధర ఇప్పుడు రూ. 1.87 లక్షలు (ఎక్స్-షోరూమ్) పలుకుతోంది. టాప్-స్పెక్ క్రోమ్ క్లాసిక్ 350 ధర రూ. 2.18 లక్షలు (ఎక్స్-షోరూమ్)గా ఉంది. రాయల్ ఎన్‌ఫీల్డ్ Meteor 350 ఫైర్‌బాల్ రేంజ్ రూ. 2,511 వరకు పెరిగింది. ఈ బైక్‌ల ధర ఇప్పుడు రూ. 2.01 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభమవుతుంది. అదే (ఎక్స్-షోరూమ్)లో అయితే రూ. 2.03 లక్షల వరకు ఉంటుంది. Meteor 350 లైనప్‌లోని స్టెల్లార్ రేంజ్ బైక్‌లు ఒక్కో వేరియంట్‌పై ధరలు రూ. 2.601 పెరగాయి. Meteor 350 స్టెల్లార్ రేంజ్ ధర ఇప్పుడు రూ. 2.07 లక్షల (ఎక్స్-షోరూమ్) నుంచి ప్రారంభం కాగా.. ఎక్స్-షోరూమ్ ధర రూ. 2.09 లక్షల వరకు ఉంటుంది. Meteor 350 లైనప్‌లోని టాప్-స్పెక్ మోడల్ Supernova బైక్ ధర భారీగా పెరిగింది. ఒక్కో వేరియంట్‌కు రూ. 2,752 వరకు పెరిగింది. ఈ రేంజ్ ధర ఇప్పుడు రూ.2.17 లక్షల నుంచి ఎక్స్-షోరూమ్ రూ. 2.19 లక్షల వరకు పెరిగాయి.

Post a Comment

0 Comments

Close Menu