Ad Code

భారత మార్కెట్లోకి యేజ్ది బైక్స్


ఒకప్పటి ట్రెండ్ సెట్టర్, క్లాసిక్ బైక్ లలో ఒక వెలుగువెలిగిన yezdi బైక్స్.. చాలా కాలం తరువాత తిరిగి భారత మార్కెట్లోకి వచ్చింది. భారత కార్ల తయారీ దిగ్గజం మహీంద్రా సంస్థ అనుబంధంగా ఏర్పడిన “క్లాసిక్ లెజెండ్స్”.. ఈ yezdi బ్రాండ్ ను తిరిగి భారత మార్కెట్లోకి తీసుకొచ్చింది. ఇప్పటికే ఈ సంస్థ నుంచి వచ్చిన jawa మోటార్ సైకిల్స్ యువతను ఆకట్టుకుంటుండగా ఇప్పుడు కొత్తగా వచ్చిన yezdi బైక్స్ కూడా బైక్ ప్రియులను ఆకట్టుకుంటాయని సంస్థ ఆశాభావం వ్యక్తం చేసింది. Yezdi నుంచి “Roadster, Scrambler, Adventure” అనే మూడు సరికొత్త బైక్ లు జనవరి 13న భారత మార్కెట్లోకి విడుదల చేసింది సంస్థ. Yezdi Roadster: Roadster ప్రత్యేకతలను గమనిస్తే.. 334 CC, సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్ ఇందులో ఉంది. ఇది 29.70 PS పవర్, 29.00 NM గరిష్ట టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్.. 6 స్పీడ్ గేర్స్, స్లిప్పర్ క్లచ్, డిజిటల్ కన్సోల్ మీటర్ ఇందులో ఉన్నాయి. ముందు 100/90 - 18" అంగుళాల టైర్, 130/80 - 17" అంగుళాల టైర్ ఉన్నాయి. డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్న ఈ బైక్ ప్రారంభ ధర ₹1,98,142గా నిర్ణయించారు. Yezdi Scrambler: Scrambler ప్రత్యేకతలను గమనిస్తే.. ఇందులోనూ 334CC సింగిల్ సిలిండర్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, DOHC ఇంజిన్ ఉంది. అయితే పవర్, టార్క్ లలో తేడాలు ఉన్నాయి. 29.10 PS పవర్, 28.20 NM గరిష్ట టార్క్ ఈ scrambler ఉత్పత్తి చేస్తుంది. ఇందులో 12.5 లీటర్ల ఇంధన ట్యాంక్, 6 స్పీడ్ గేర్లు, స్లిప్పర్ క్లచ్, డిజిటల్ కన్సోల్ మీటర్ ఫీచర్స్ ఉన్నాయి. Scrambler బైక్ రూపురేఖలు మాత్రం మరింత ఆకట్టుకుంటున్నాయి. ముందు భాగంలో 100/90 - 19″ అంగుళాల టైర్, వెనుక 140/70 - 17" అంగుళాల టైర్ ఉన్నాయి. డ్యూయల్ ఎక్జాస్ట్(జంట సైలెన్సర్), డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్న ఈ బైక్ ప్రారంభ ధర ₹2,04,900గా నిర్ణయించారు. Yezdi Adventure: Adventure బైక్ లోనూ దాదాపుగా మిగతా రెండు బైక్ లలో ఉన్న ఫీచర్స్ ఉన్నాయి. అయితే ఈ బైక్ పూర్తిగా అడ్వెంచర్ టూరింగ్ కోసం తీర్చిదిద్దారు. 334 CC సింగిల్ సిలిండర్ ఇంజిన్, 4 స్ట్రోక్, లిక్విడ్ కూల్డ్, DOHCతో వస్తున్న ఈ బైక్ గరిష్టంగా 30.20 PS పవర్, 29.90 NM టార్క్ ను ఉత్పత్తి చేస్తుంది. 15.5 లీటర్ల ఇంధన ట్యాంక్, LCD క్లస్టర్, బ్లూటూత్ కనెక్టివిటీ సైడ్ లగేజి కారియర్లు వంటి అదనపు ఫీచర్స్ ఈ అడ్వెంచర్ వేరియంట్ లో ఉన్నాయి. సింగిల్ ఎక్జాస్ట్(ఒక సైలెన్సర్), డ్యూయల్ ఛానల్ ABSతో వస్తున్న ఈ బైక్ ప్రారంభ ధర ₹2,09,900గా నిర్ణయించారు. ఈ Yezdi Adventure బైక్ భారత్ లో రాయల్ ఎంఫిల్డ్ హిమాలయన్ కు గట్టిపోటీ ఇస్తుందని బైక్ రివ్యూ సంస్థలు భావిస్తున్నాయి. ఇవి భారత ద్విచక్ర మార్కెట్లోకి కొత్తగా వచ్చిన Yezdi బైక్స్ విశేషాలు.

Post a Comment

0 Comments

Close Menu