Ad Code

వాన్ ఎలక్ట్రిక్ మోటో ప్రైవేట్ లిమిటెడ్ వారి కొత్త ఎలక్ట్రిక్ సైకిల్


భారతీయ మార్కెట్లో ఎలక్ట్రిక్ వాహనాలకు పెరుగుతున్న డిమాండ్ కారణంగా కొత్త కొత్త ఎలక్ట్రిక్ వాహనాలు విడుదలవుతున్నాయి. ఇందులో భాగంగానే ఇండియన్ లైఫ్ స్టైల్ ఈ-మొబిలిటీ స్టార్టప్ కంపెనీ వాన్ ఎలక్ట్రిక్ మోటో ప్రైవేట్ లిమిటెడ్ దేశీయ మార్కెట్లో ఒక కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ విడుదల చేసింది. వాన్ ఎలక్ట్రిక్ మోటో ప్రైవేట్ లిమిటెడ్ విడుదల చేసిన ఈ ఎలక్ట్రిక్ సైకిల్ రెండు వేరియంట్లలో అందుబాటులో ఉన్నాయి.  ఇందులో ఒకటి అర్బన్‌స్పోర్ట్ ఎలక్ట్రిక్ సైకిల్ కాగా, మరొకటి అర్బన్‌స్పోర్ట్ ప్రో ఎలక్ట్రిక్ సైకిల్. వీటి ధరలు వరుసగా రూ. 59,999 మరియు రూ. 69,999. దేశీయ మార్కెట్లో విడుదలైన ఈ కొత్త ఎలక్ట్రిక్ సైకిల్ భారతదేశంలోని కొన్ని ప్రధాన నగరాల్లో అంటే గోవా, కొచ్చి, బెంగుళూరు, ముంబై, హైదరాబాద్ మరియు ఢిల్లీ వంటి నగరాల్లో విక్రయానికి అందుబటులో ఉంది.  ఈ ఎలక్ట్రిక్ సైకిల్ కావాలనుకునే కస్టమర్లు కంపెనీ యొక్క అధికారిక వెబ్‌సైట్ https://vaanmoto.com/ ద్వారా ప్రీ-ఆర్డర్‌లను తీసుకోవడం ప్రారంభించింది. డెలివరీలు కూడా త్వరలో ప్రారంభమవుతాయి. అర్బన్‌స్పోర్ట్ మరియు అర్బన్‌స్పోర్ట్ ప్రో రెండూ ఉన్నత స్థాయి ఇంజనీరింగ్ నైపుణ్యాన్ని కలిగి ఉన్న మరియు వినియోగానికి కావలసిన ఆధునిక ఉత్పత్తులు. ఈ రెండు వాహనాలు గతంలో ఇటలీలో జరిగిన EICMA 2021 మోటార్‌ సైకిల్ ప్రదర్శనలో పరిచయం చేయబడ్డాయి. తరువాత ప్రపంచవ్యాప్తంగా కూడా అందుబాటులోకి  వచ్చాయి. అల్యూమినియం యునిసెక్స్ ఫ్రేమ్, శాడిల్, రిమ్స్ మరియు హ్యాండిల్‌బార్‌లను ఇటాలియన్ బ్రాండ్ యొక్క ఇ-బైక్ వర్టికల్‌గా రూపొందించిన బెనెల్లీ బిసిక్లెట్ రూపొందించాయి. వాన్ వారితో ఇంజినీరింగ్ మరియు సరఫరా గొలుసు కోసం టైఅప్ చేసారు మరియు అర్బన్‌స్పోర్ట్ ఎలక్ట్రిక్ సైకిల్స్ అభివృద్ధి చేయడానికి బెనెల్లీ బృందంతో కలిసి పనిచేశారు. ఈ రెండు ఎలక్ట్రిక్ సైకిల్స్ లో దాదాపు అన్ని ప్రధాన మెకానికల్‌లు ఒకే విధంగా ఉంటాయి.

Post a Comment

0 Comments

Close Menu