Ad Code

టెలిస్కోపిక్ మాక్రో లెన్స్


బడ్జెట్ స్మార్ట్ ఫోన్ తయారీ సంస్థ “టెక్నో”, స్మార్ట్ ఫోనేతర పరికరాలపై దృష్టిపెట్టింది. అందులో భాగంగా స్మార్ట్ ఫోన్స్ కెమెరాల కోసం “టెలిస్కోపిక్ మాక్రో లెన్స్”ను టెక్నో సంస్థ ఆవిష్కరించింది. ఫోన్ కెమెరాను మరింత జూమ్ చేసి స్పష్టమైన ఇమేజ్ లను అందించేందుకు ఈ లెన్స్ ఉపయోగపడుతుందని సంస్థ ఒక ప్రకటనలో తెలిపింది. స్మార్ట్ ఫోన్ తో వీడియోలు, ఫోటో షూట్ లు చేసేవారికి ఈ కొత్త లెన్స్ ఎంతో ఉపయోగకరంగా ఉంటుందని సంస్థ తెలిపింది. ఫోన్ కెమెరాకు అనుసంధానించే విధంగా ప్రత్యేకమైన మోటార్ కలిగిన లెన్స్ మాడ్యూల్ ను డిజైన్ చేశారు. వీడియో, ఫోటో తీస్తున్న సమయంలో జూమ్ చేయగా మాడ్యూల్ లోని మోటార్ ద్వారా లెన్స్ ముందుకు వెనక్కు చేసుకోవచ్చు. ఇది నూటికినూరు శాతం స్పష్టమైన ఫోటోలను తీయగలదని “టెక్నో” సంస్థ తెలిపింది. ఇప్పటివరకు ఈ కొత్త పరికరానికి సంబంధించి పూర్తి వివరాలు వెల్లడించని “టెక్నో” సంస్థ.. త్వరలోనే ఈ లెన్స్ ను మార్కెట్లోకి విడుదల చేస్తామని తెలిపింది. అయితే ప్రస్తుతం వస్తున్న స్మార్ట్ ఫోన్స్ లలో ట్రిపుల్, క్వాడ్ కెమెరా (4 కెమెరాలు) సెటప్ ఉంటుండగా.. వాటికీ ఈ లెన్స్ ఎలా సరిపోతుందనే విషయంపై సందేహాలు తలెత్తుతున్నాయి. కేవలం కొన్ని ఫోన్లలో మాత్రమే ఈ లెన్స్ ను ఉపయోగించే అవకాశం ఉండొచ్చని టెక్ పండితులు భావిస్తున్నారు. చైనాకు చెందిన బడ్జెట్ ఫోన్ సంస్థ “టెక్నో”, భారత్ లో మార్కెట్ ను విస్తరించేందుకు మరికొన్ని కొత్త ఫోన్ లను తీసుకొస్తున్న సంగతి తెలిసిందే.

Post a Comment

0 Comments

Close Menu