Ad Code

వాట్సప్ యూజర్లకు అలర్ట్...!


ప్రపంచవ్యాప్తంగా 200 కోట్లకు పైగా వాట్సప్ యూజర్లు ఉన్నారని అంచనా. భారతదేశంలోనే 48 కోట్లకు పైనే యూజర్లు ఉన్నారు. యూజర్ల కోసం వాట్సప్ నిత్యం అనేక ఫీచర్స్ అందిస్తూ ఉంటుంది. అయితే ఇప్పటికీ యూజర్లకు కావాల్సిన అన్ని ఫీచర్స్ వాట్సప్‌లో లేవు. వాట్సప్‌లో లేని ఫీచర్స్ కోసం యూజర్లు థర్డ్ పార్టీ యాప్స్ ఉపయోగిస్తూ ఉంటారు. ఈ యాప్స్ వాట్సప్‌ని బైపాస్ చేసి యూజర్లకు కావాల్సిన ఫీచర్స్ అందిస్తుంటాయి. అయితే ఇలాంటి థర్డ్ పార్టీ యాప్స్‌తో రిస్కు తప్పదు. తాజాగా WAMR పేరుతో ఓ యాప్ యూజర్లను బాగా ఆకట్టుకుంటోంది. డిలీట్ చేసిన మెసేజెస్, వాట్సప్ స్టేటస్‌లను రికవర్ చేసేందుకు ఉపయోగించే యాప్ ఇది. వాట్సప్‌లో ఒక యూజర్ ఏదైనా మెసేజ్ పంపితే ఆ మెసేజ్‌ను డిలీట్ చేసే అవకాశం ఉంది. అంటే అవతలివారు చూడకముందే ఆ మెసేజ్ డిలీట్  చేయొచ్చు. ఇందుకోసం delete message for everyone ఆప్షన్ ఉంది. అయితే అవతలివారు మెసేజ్ డిలీట్ చేసిన తర్వాత This message was deleted అని కనిపిస్తుంది. అవతలివారు ఏదో మెసేజ్ పంపి డిలీట్ చేశారని తెలియడంతో యూజర్లలో ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవాలన్న ఆసక్తి మొదలవుతుంది. వాట్సప్‌లో తిరిగి ఆ మెసేజ్ ఏంటో తెలుసుకోవడం సాధ్యం కాదు. కానీ థర్డ్ పార్టీ యాప్స్ ద్వారా ఇలా డిలీట్ చేసిన మెసేజెస్ తెలుసుకుంటున్నారు యూజర్లు. WAMR యాప్ కూడా ఇలాగే ఉపయోగపడుతోంది. WAMR యాప్ మీకు వచ్చే నోటిఫికేషన్స్‌ని ట్రాక్ చేస్తుంది. ఒకవేళ అవతలి వ్యక్తం మెసేజ్ డిలీట్ చేసినా WAMR యాప్ మీ నోటిఫికేషన్ హిస్టరీని రికార్డ్ చేస్తుంది. ఈ రికార్డ్ నుంచి మీకు వచ్చిన మెసేజెస్ చూడొచ్చు. అందులో డిలీట్ చేసిన మెసేజెస్ కూడా కనిపిస్తాయి. అయితే ఇలాంటి యాప్స్‌తో ఆన్‌లైన్ ప్రైవసీ విషయంలో రిస్కు ఉంటుందని సైబర్ నిపుణులు హెచ్చరిస్తున్నారు. అయితే ఈ యాప్ పనిచేయడానికి అనేక సెట్టింగ్స్‌కు యాక్సెస్ ఇవ్వాల్సి ఉంటుందని కాబట్టి ఈ యాప్ ప్రమాదకరమని ఇంటర్నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైబర్ సెక్యూరిటీలోని (IICS) సైబర్ సెక్యూరిటీ నిపుణులు హెచ్చరిస్తున్నారు. ఈ యాప్ పనిచేయాలంటే మీ స్మార్ట్‌ఫోన్ గ్యాలరీ, నెట్వర్క్, నోటిఫికేషన్స్ యాక్సెస్ ఇవ్వాలి. ఇలా స్మార్ట్‌ఫోన్‌ లోని ముఖ్యమైన సెట్టింగ్స్‌కు థర్డ్ పార్టీ యాప్స్‌కు యాక్సెస్ ఇస్తే మీరు రిస్కులో పడ్డట్టే. ఈ యాప్ హానికరమైనదని, సున్నితమైన డేటా థర్డ్ పార్టీ యాప్ చేతుల్లోకి వెళ్తుందని నిపుణులు వార్నింగ్ ఇస్తున్నారు. మీరు ఈ యాప్ లేదా ఇలాంటి థర్డ్ పార్టీ యాప్ ఏదైనా ఉపయోగిస్తున్నట్టైతే వీటితో ఉన్న రిస్కుల్ని గుర్తుంచుకోండి.

Post a Comment

0 Comments

Close Menu