Ad Code

మిమిక్రీ చేస్తున్న రోబో!


రోబోలు అంటే యంత్రంలా మాత్రమే ఉండేవి ఒకప్పుడు. కానీ ఇప్పుడు రోబోలను చూస్తే అవి రోబోలా? లేకా మనిషా? అనిపించేలా ఉంటున్నాయి. రోబోలు మాట్లాడతాయి. మనం మాట్లాడేది అర్థం చేసుకుని ప్రతిస్పందిస్తాయి కూడా. స్పందించేవాటిని రోబోలు అని అనలేం. కానీ అవి రోబోలే. టెక్నాలజీ పెరిగే కొద్దీ రోబోలకు మనుషులకు తేడా లేకుండాపోతోంది. అచ్చు మనిషిలా మాట్లాడటమే కాదు ఎమోషన్ గా ఫీల్ అవుతున్నాయి కూడా. నవ్వుతున్నాయి. మన చెప్పే విషయాన్ని అర్థం చేసుకుని తల ఊపడం కూడా చేస్తున్నాయి. అంతేకాదు రోబోలు మిమిక్రీ కూడా చేస్తున్నాయి. ఏంటీ మిమిక్రీయా? అని ఆశ్చర్యపోతున్నారా? నిజమే మిమిక్రీ చేసే ఓ రోబో వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈరోబోను చూస్తే మనిషా? రోబోనా? అనే డౌట్ కచ్చితంగా వస్తుంది. ఇటువంటి రోబోలను హ్యూమనాయిడ్ రోబోలు అంటారు. చాలా ఏళ్ల నుంచి హ్యూమనాయిడ్ రోబోలపై శాస్త్రవేత్తలు విస్తృతంగా పరిశోధనలు చేస్తున్నారు. ఎహా న్యూస్ అనే ట్విట్టర్ అకౌంట్‌లో రోబోకు సంబంధించిన ఈ వీడియోను షేర్ చేశారు. ఈ రోబో పేరు అట్లాస్‌. మనిషిలాగానే హావభావాలను పలికిస్తూ పలకరిస్తుంది. అలరిస్తోంది ఈ అట్లాస్ రోబో. అట్లాస్ రోబో మనిషిలా మిమిక్రీ కూడా చేస్తు ఆశ్చర్యపరుస్తు సోషల్ మీడియాలో హల్ చల్ చేస్తోంది.

Post a Comment

0 Comments

Close Menu