Ad Code

అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ రాబోతోంది !


రిపబ్లిక్ డే సందర్భంగా, అమెజాన్ తన ఆన్ లైన్ ప్లాట్ ఫారం పైన అమెజాన్ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ ని ప్రకటించింది. అమెజాన్ ఈ సేల్ నుండి అనేక ప్రోడక్ట్స్ పైన భారీ డిస్కౌంట్, బ్యాంక్ అఫర్ మరియు మరిన్ని డీల్స్ అందించనున్నట్లు టీజింగ్ కూడా మొదలు పెట్టింది. 2022 లో అమెజాన్ యొక్క ఈ మొదటి సేల్ నుండి మంచి డీల్స్ అందుకునే అవకాశం వుంది. ఈ సేల్ డేట్ ఇంకా ప్రకటించనప్పటికీ త్వరలోనే మొదలవుతుంది. అమెజాన్ ఇండియా ఆన్ లైన్ ప్లాట్ ఫారం ప్రధాన పేజ్ బ్యానర్ ద్వారా ఈ సేల్ గురించి టీజ్ చేస్తోంది. అమెజాన్ ఈ గ్రేట్ రిపబ్లిక్ డే సేల్ సేల్ ని ఎస్ బి ఐ  భాగస్వామ్యంతో నిర్వహిస్తోంది మరియు ఈ సేల్ నుండి ఎస్ బి ఐ బ్యాంక్ యొక్క క్రెడిట్ కార్డు ద్వారా వస్తువులను కొనుగోలు చేసే వినియోగదారులకు 10% అధనపు డిస్కౌంట్ అఫర్ ను కూడా ప్రకటించింది. అలాగే, అమెజాన్ కూపన్స్, రివార్డ్స్ ఫెస్టివల్ వంటి మరిన్ని లాభదాయకమైన ఆఫర్లను కూడా ప్రకటించింది. ప్రతి సంవత్సరం కూడా అమెజాన్ రిపబ్లిక్ డే సమయంలో ఈ అమ్మకాన్ని ప్రారంభిస్తుంది. ఈ సేల్ నుండి మొబైల్ ఫోన్స్ పైన భారీ డీల్స్ ని అందిస్తుంది. అలాగే, హెడ్ ఫోన్స్, ఎలక్ట్రానిక్స్ మరియు మరిన్ని ప్రోడక్ట్స్ పైన గరిష్టంగా 70% వరకు తగ్గింపు ఈ సేల్ నుండి అందిస్తున్నట్లు ఇప్పటికే టీజింగ్ మొదలుపెట్టింది. అదనంగా, కొత్త ప్రోడక్ట్స్ లాంచ్, నో కాస్ట్ ఇ ఎం ఐ మరియు మరిన్ని లాభాలను కూడా అందిస్తుంది.

Post a Comment

0 Comments

Close Menu