Ad Code

పేమెంట్ వాలెట్‌లా మారనున్న ఐఫోన్


ఐఫోన్‌తో కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసే ఫీచర్ త్వరలో ఐఫోన్‌లో రాబోతోందని యాపిల్ సంస్థ ప్రకటించింది. దాని కోసం సపరేట్‌గా హార్ట్‌వేర్ అవసరం లేకుండా ఫీచర్‌ను యాపిల్ డెవలప్ చేస్తోంది. ఈ ఫీచర్‌ను యాపిల్ త్వరలో తీసుకురాబోయే ఐవోఎస్ 15.4 వర్షన్‌లో తీసుకురానున్నట్టు తెలుస్తోంది. ఈ ఫీచర్ వల్ల చిన్న బిజినెస్ చేసుకునే మర్చంట్లు పేమెంట్‌ను ఐఫోన్ ద్వారా యాక్సెప్ట్ చేసే అవకాశం ఉంటుంది. ఈ ఫీచర్ మీద యాపిల్ 2020 నుంచి వర్క్ చేస్తోంది. దాని కోసమే కెనడాకు చెందిన మొబీవేవ్ అనే ఓ స్టార్టప్ కంపెనీని కొనుగోలు చేసింది. ఐఫోన్‌నే ఒక పేమెంట్ వాలెట్‌గా మార్చడం కోసం ఒక యాప్, ఫోన్‌లోని ఎన్ఎఫ్‌సీ ఉంటే చాలు. దాని కోసం సపరేట్‌గా హార్ట్‌వేర్ అవసరం లేకుండా ఈ ఫీచర్‌ను మొబీవేవ్ తీసుకురానుంది. ఈ ఫీచర్ ద్వారా స్టోర్ యజమాని ఫోన్‌లో కస్టమర్ ఎంత డబ్బు చెల్లించాలో టైప్ చేస్తాడు. ఆ తర్వాత కస్టమర్ తన క్రెడిట్ కార్డును ఫోన్ వెనుక వైపు ట్యాప్ చేస్తే చాలు. పేమెంట్ వెంటనే పూర్తవుతుంది. యాపిల్ పేలో భాగంగా ఈ ఫీచర్‌ను తీసుకొస్తారా? లేక ఈ ఫీచర్ పూర్తి ఫంక్షనాలిటీ ఏంటి అనే దానిపై ఇంకా యాపిల్ క్లారిటీ ఇవ్వనప్పటికీ బ్లూమ్‌బెర్గ్ సోర్స్ మేరకు సపరేట్ గా యాప్‌ను డెవలప్ చేసి దాని ద్వారా ఐఫోన్‌నే పేమెంట్ వాలెట్‌గా మార్చే అవకాశాలు ఉన్నట్టు తెలుస్తోంది.2019లో  మొబీవేవ్ సామ్‌సంగ్‌తో కూడా కలిసి పనిచేసింది. అప్పుడు మర్చంట్స్‌కు ఇలాంటి ఫీచర్‌నే సామ్‌సంగ్ అందించింది. దానికి సామ్‌సంగ్ పీవోఎస్ అనే పేరును పెట్టింది. ఆ సర్వీస్‌తో చిన్న చిన్న బిజినెస్‌లు సామ్‌సంగ్ ఫోన్ల ద్వారా కాంటాక్ట్‌లెస్ పేమెంట్స్‌ను యాక్సెప్ట్ చేసే ఫెసిలిటీని అందించింది.


Post a Comment

0 Comments

Close Menu