Ad Code

స్మార్ట్ ఫోన్లు అధికంగా వాడే దేశాలు


ఎన్నో పనులకు మనం స్మార్ట్ ఫోన్ వాడుతున్నాం. రోజూ మనం ఎంత సేపు స్మార్ట్ ఫోన్ వాడుతున్నామో తెలిసుకోవాలి. లేకుంటే సమయం అంతా వృథా అయ్యే అవకాశం ఉంటుంది. ప్రపంచంలో2021లో స్మార్ట్ ఫోన్ వినియోగదారులు రోజు ఎంత సేపు ఫోన్ వాడుతున్నారు అనే అంశంపై సర్వే నిర్వహించారు. ఈ సర్వే ప్రకారం ప్రపంచ వ్యాప్తంగా రోజుకు సగటున ప్రతీ ఒక్కరు 4.8గంటలు ఫోన్ వాడుతున్నారని తెలింది. 2019లో ఈ స్మార్ట్ ఫోన్ వినియోగం 3.7 గంటలు ఉంది. 2020లో గణనీయంగా 4.5 గంటలకు పెరింది. 2021 ఈ వినియోగం 4.7 గంటలకు చేరింది. ప్రపంచ వ్యాప్తంగా ఏ దేశాల్లో ప్రజలు ఎక్కువగా ఫోన్ వాడుతున్నారో కూడా ఈ సర్వే వివరాలు వెల్లడించింది. ప్రపంచంలో అత్యధికంగా బ్రెజిల్ వాసులు ఫోన్‌ను వినియోగిస్తున్నారు. వారు 5.4 గంటలు సగటున వాడుతున్నారు. అత్యల్పంగా చైనా ఫోన్‌లను వినియోగిస్తుంది. 3.2 గంటలు సగటున వాడుతున్నారు.  బ్రెజిల్ తరువాత ఇండోనేషియా, సౌత్ ఆఫ్రికా, మెక్సికో, ఇండియా వున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu