Ad Code

జిన్‌ జియాంగ్‌లో టెస్లాను మూసేయండి


2022 ఏడాది సందర్భంగా ప్రముఖ అమెరికన్‌ ఎలక్ట్రిక్‌ వాహనాల తయారీ కంపెనీ టెస్లా చైనాలో డిసెంబర్ 31న కొత్త షోరూం ఓపెన్ చేస్తున్నట్టు ప్రకటించింది. జిన్‌ జియాంగ్‌ ప్రాంతంలో టెస్లా కొత్త షోరూంను ఏర్పాటుచేసింది. దీనిపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చైనాలో జిన్‌ జియాంగ్‌ అనేది వివాదాస్పద ప్రాంతం.. ఈ ప్రాంతంలో టెస్లా కంపెనీ షోరూమ్‌ను ఏర్పాటు చేయడాన్ని అమెరికా కమర్షియల్ కంపెనీలు సహా అంతర్జాతీయ హక్కుల సంస్థలు టెస్లా అధినేత ఎలన్‌ మస్క్‌ను ఏకిపారేస్తున్నాయి. జిన్‌జియాంగ్‌లో ఓపెన్ చేసిన టెస్లా షోరూమ్‌ను వెంటనే మూసివేసియాలని డిమాండ్ చేస్తున్నారు. ఇటీవలే చైనాలోని జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ఉరుమ్‌కిలో టెస్లా షోరూమ్‌ను ప్రారంభించినట్టు టెస్లా విబోలో వెల్లడించింది. యూఎస్‌ ట్రేడ్ గ్రూప్, అలయన్స్ ఫర్ అమెరికన్ మాన్యుఫ్యాక్చరింగ్, సెనేటర్ మార్కో రూబియో సంస్థలు కూడా టెస్లా షోరూం ఓపెన్ చేసినందుకు మస్క్‌పై విమర్శలు గుప్పిస్తున్నారు. దీనిపై టెస్లా నుంచి ఇప్పటివరకు అధికారికంగా ఎలాంటి స్పందన లేదు. చైనాలో జిన్‌ జియాంగ్‌ ప్రాంతంపై ప్రభుత్వ వైఖరిని ఖండిస్తూ పాశ్చ్యాత దేశాలు భారీ ఎత్తున్న విమర్శలు చేశాయి. దీనికి కారణం లేకపోలేదు.. జిన్‌జియాంగ్‌లో ఉయ్ఘర్‌లు, మైనారిటీలను అక్కడి ప్రభుత్వం నిర్భంధిస్తోంది.. వారిపట్ల క్రూరంగా ప్రవర్తిస్తోందని నివేదకలు చెబుతున్నాయి. ఈ నేపథ్యంలో అంతర్జాతీయ సమాజం డ్రాగన్ చైనాపై తీవ్ర విమర్శలు చేస్తోంది. ఈ క్రమంలోనే బీజింగ్ వింటర్ ఒలింపిక్స్ బహిష్కరించాని డిమాండ్ చేశాయి. జిన్‌జియాంగ్‌ ప్రాంతంలో ప్రజలపై చైనా ప్రభుత్వం తీరుపై ప్రపంచ దేశాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. ప్రపంచ దేశాలు చేస్తున్న ఆరోపణలపై స్పందించిన చైనా తీవ్రంగా ఖండించింది. జూలైలో, స్వీడిష్ ఫ్యాషన్ రిటైలర్ హెచ్ & ఎం మార్చి-మే త్రైమాసికంలో చైనాలో స్థానిక కరెన్సీ అమ్మకాల్లో 23శాతం తగ్గుదలను నివేదించింది. తద్వారా మార్చిలో వినియోగదారుల బహిష్కరణకు గురైంది. గత నెలలో, యుఎస్ చిప్‌మేకర్ ఇంటెల్ కూడా ఇదే తరహా విమర్శలు ఎదుర్కొంది. జిన్‌జియాంగ్ నుంచి ఉత్పత్తులను తీసుకొవద్దని సరఫరాదారులకు సూచనలు చేశాయి. చైనీస్ కస్టమర్‌లు, ప్రజలకు కలిగించిన ఇబ్బందులకు క్షమాపణలు చెప్పాల్సిందిగా డిమాండ్ చేశారు. బీజింగ్ విధానాలను వ్యతిరేకిస్తూ.. జిన్‌జియాంగ్ పత్తి వంటి దిగుమతులను వాషింగ్టన్ నిషేధించడంతో.. చైనా కంపెనీలను బ్లాక్‌లిస్ట్‌లో పెట్టాయి.

Post a Comment

0 Comments

Close Menu