Ad Code

ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్!


మెటాకు చెందిన సోషల్‌మీడియా దిగ్గజం ఫేస్‌బుక్‌ తమ యూజర్లకు గుడ్‌ న్యూస్‌ చెప్పింది. ఎట్టకేలకు ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్షన్‌ సెక్యూరిటీ ఫీచర్‌ను మెసెంజర్‌ యూజర్లకు అందుబాటులోకి తెచ్చింది. ఈ కొత్త అప్‌డేట్ ఎలా ఉంటుందనే వివరాలను సంస్థ షేర్ చేసింది. ఇదివరకు ఫేస్‌బుక్ మెసెంజర్‌లో ఎండ్‌ టూ ఎండ్‌ ఎన్‌క్రిప్టెడ్‌ ఫీచర్‌ కొంత మందికి మాత్రమే అందుబాటులో ఉండేది. అయితే మెసేంజర్‌లో యూజర్లు చేసే చాట్స్‌, కాల్స్‌కు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్టెడ్ సెక్యూరిటీ ఫీచర్‌ ఇప్పుడు అందరికీ అందుబాటులోకి తెస్తున్నట్టు మెటా వెల్లడించింది. వ్యక్తిగత ప్రైవసీ, సమాచార భద్రత కోసం ఈ ఎన్‌క్రిప్షన్ అవసరమని మెటా చెబుతోంది. ఎండ్ టు ఎండ్ ఎన్ క్రిప్షన్ అనేది ఒక ముఖ్యమైన సెక్యూరిటీ ఫీచర్. ఎన్‌క్రిప్షన్ అంటే ఏదైనా సమాచారాన్ని చదవటానికి వీలులేకుండా కోడ్స్ రూపంలోకి మార్చేయటం. మనకు తెలియకుండా ప్రతి రోజూ ఆన్‌లైన్‌లో ఎన్‌క్రిప్షన్ టెక్నాలజీని వాడుతూనే ఉన్నాం. ఎన్ క్రిప్షన్ అంటే ఇద్దరు వ్యక్తుల మధ్య జరిగే సంభాషణలు మూడో వ్యక్తి చదవకుండా వేసే లాక్ లాంటిది. ఇంటర్నెట్ బ్యాంకింగ్, ఈమెయిల్స్ వంటి సేవల్లో ఈ ఎన్‌క్రిప్షన్‌ను ఎక్కువగా వాడుతుంటారు. అంతకుముందు వరకూ ఈ ఫీచర్ లిమిటెడ్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. ఇది ఇప్పుడు మెసెంజర్‌ని ఉపయోగిస్తున్న ప్రతి ఒక్కరికీ ఈ అప్‌డేట్ ఇవ్వనున్నట్లు మెటా తెలిపింది. అయితే ఈ ఫీచర్ డిఫాల్ట్‌గా పనిచేయదు. ఎవరికి వారు వారి వ్యక్తిగత ప్రైవేట్ చాట్‌ల కోసం E2EE ఆప్షన్‌ను ఆన్ చేసుకోవాలి. రాబోయే వారాల్లో ఈ ఫీచర్ అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu