Ad Code

వాట్సాప్​లో డ్రాయింగ్ ఎడిటర్‌ ఫీచర్ ?


మెటా యాజమాన్యంలోని వాట్సాప్​ ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్లను జోడిస్తూ యూజర్లను ఆకట్టుకుంటోంది. వాట్సాప్ తరహాలో అనేక యాప్స్ అందుబాటులో​ ఉన్నప్పటికీ.. యూజర్​ ఫ్రెండ్లీ ఇంటర్​ఫేజ్ వల్ల టాప్​ ఇన్​స్టంట్​ మెసేజింగ్​ యాప్​గా కొనసాగుతోంది. ఇక యూజర్లను మరింతగా పెంచుకోవడంలో భాగంగా వాట్సాప్ కొత్త ఏడాదిలో మరో ఇంట్రెస్టింగ్​ ఫీచర్​పై పనిచేస్తుంది. ఒక కొత్త డ్రాయింగ్ టూల్‌ను అభివృద్ధి చేస్తోంది. ఇది యూజర్​ ప్రొఫైల్ పిక్చర్‌ను ఎడిట్​ చేయడం, బ్లర్ చేయడం, పిక్చర్​పై రాయడం మొదలైనవి చేయడంలో సహాయపడుతుంది. ఈ ఫీచర్​ను తొలుత ఆండ్రాయిడ్ యూజర్ల కోసం తీసుకురానుంది. "ఆండ్రాయిడ్​ 2.22.3.5 అప్‌డేట్​ గల కొత్త వాట్సాప్​ బీటా వెర్షన్​లో సరికొత్త డ్రాయింగ్ ఎడిటర్‌ ఫీచర్‌ను విడుదల చేయడానికి వాట్సాప్​ ప్లాన్ చేస్తున్నాం." అని WABetaInfo పేర్కొంది. ఈ డ్రాయింగ్ ఎడిటర్ ఫీచర్ కేవలం ఫోటో ఎడిటింగ్​ కోసం మాత్రమే కాకుండా వీడియో ఎడిటింగ్​ కోసం కూడా పని చేస్తుంది. దీంతో మీ ఫోటో లేదా వీడియోను ఎడిట్ లేదా బ్లర్ చేయడానికి ఏదైనా థర్డ్​ పార్టీ యాప్స్ అవసరం ఉండదు. వాట్సాప్​లో​ మీ ఫోటోలు, వీడియోలపై గీయడానికి కొత్త పెన్సిల్‌లను కూడా జోడించాలని ప్లాన్ చేస్తోంది. ఈ క్రమంలోనే వాట్సాప్​లో మొత్తం మూడు పెన్సిళ్లను చేర్చనుంది. వాట్సాప్​ బీటా ఆండ్రాయిడ్​ యూజర్లకు తొలుత ఈ ఫీచర్ల అందుబాటులోకి రానుంది. ఆ తర్వాత ఐఓఎస్​ డివైజెస్​లో అందుబాటులోకి వస్తుంది. ఈ కొత్త డ్రాయింగ్ టూల్​ ప్రస్తుతం అభివృద్ధి దశలోనే ఉంది. బీటా టెస్టర్లకు ఎప్పుడు విడుదల చేస్తారనే దానిపై స్పష్టత లేదు. వాట్సాప్​ ఇటీవల గ్లోబల్​ వాయిస్​ నోట్​ ప్లేయర్​ అనే ఫీచర్​ను సైతం పరిచయం చేసింది. ఈ ఫీచర్ ద్వారా మీ చాట్​ బాక్సులో వేర్వేరు చాట్​ స్క్రోల్ చేస్తూనే వాయిస్​ మెసేజ్​ వినొచ్చు. ఉదాహరణకు, ఏదైనా చాట్​లో వాయిస్​ మెసేజ్ ఉంటే.. ఆ మెసేజ్​ ఓపెన్​ చేసిన మరో చాట్​కు వెళ్లినా సరే.. అది ప్లే అవుతూనే ఉంటుంది. ఇప్పటికే ఈ గ్లోబల్​వాయిస్​ నోట్​ ఫీచర్​ను​ కొన్ని ఐఓఎస్​ బీటా టెస్టర్ల కోసం రిలీజ్​ చేసింది వాట్సాప్​. ఈ ఫీచర్ త్వరలోనే ఆండ్రాయిడ్​ బీటా టెస్టర్లకు సైతం అందుబాటులోకి రానుంది.

Post a Comment

0 Comments

Close Menu