ఆకర్షణీయమైన వోడాఫోన్ ఐడియా ప్రీపెయిడ్ ప్లాన్ !


వోడాఫోన్ ఐడియా  టెలికాం సంస్థ తన యొక్క యూజర్ బేస్ ను పెంచుకోవడం కోసం తన యొక్క ప్రత్యర్దులకు పోటీగా అన్ని విభాగాలలో కొత్త కొత్త ప్లాన్లను అందిస్తోంది. భారతదేశం అంతటా నివసిస్తున్న ప్రీపెయిడ్ కస్టమర్లకు రూ.599 ధర వద్ద ఒక ప్రీపెయిడ్ ప్లాన్‌ను అందిస్తుంది. ఈ ప్లాన్ యొక్క ప్రత్యేకత ఏమిటంటే ఇది 70 రోజుల వ్యాలిడిటీతో వస్తుంది. డేటా పరంగా చూసుకుంటే వినియోగదారులకు రోజువారీ 1.5GB డేటా, అపరిమిత వాయిస్ కాలింగ్ మరియు 100 SMS/రోజుకు వంటి ప్రయోజనాలు పొందుతారు. డేటా డిలైట్స్, వీకెండ్ రోల్‌ఓవర్ మరియు బింగే ఆల్ నైట్ ఆఫర్‌తో సహా Vi Hero అన్‌లిమిటెడ్ ప్రయోజనాలను కూడా ప్లాన్ బండిల్ చేస్తుంది. అన్ని అదనపు ఆఫర్‌లు వినియోగదారుల డేటా వినియోగ అనుభవాన్ని ఒక విధంగా లేదా మరొక విధంగా మెరుగుపరచడానికి ఉద్దేశించబడ్డాయి. ఈ ప్లాన్ జియో మరియు ఎయిర్టెల్ సంస్థలు అందించే 84 రోజుల వాలిడిటీ ప్లాన్‌ కంటే చాలా మెరుగ్గా ఉంది. 

Post a Comment

0 Comments