Ad Code

చైనాలో మరో జాబిల్లి


అందరాని చందమామను సైతం మనిషి అందుకున్నాడు. చందమామపైకి వెళ్లిన మనిషి అక్కడి వింతలను విశేషాలను తెలుసుకున్నాడు. కానీ దాన్ని భూమ్మీదకు తీసుకురాలేడు కదా..కానీ చైనా మాత్రం దాదాపు అటువంటి అసాధ్యాన్ని సుసాధ్యం చేసింది. 'కత్రిమ సూర్యుడు'ని తయారు చేసి ప్రపంచ దేశాల్నిసైతం షాక్ కు గురించేసిన చైనా తాజాగా ఓ చందమామను కూడా తయారుచేసింది. అచ్చం చంద్రుడిపై ఉన్నఅనుభూతిని  కలిగించటానికి చైనా టెక్నాలజీతో సుసాధ్యం చేసింది. చంద్రుడిపై ఉన్న భారరహిత స్థితిని, వాతావరణాన్ని ఏర్పాటు చేసి చైనా రెండు అడుగుల వెడల్పు ఉండే ఓ చంద్రుడిని సృష్టించింది. తమ వ్యోమగాములకు చంద్రుడిపై పరిస్థితుల గురించి శిక్షణనిచ్చేందుకు జియాంగ్సూ ప్రావిన్స్‌లోని షుఝవ్‌ నగరంలో ఈ చంద్రుడిని చైనా ఏర్పాటు చేసింది. చంద్రుడిపై ఉన్న పరిస్థితులనే నేలపై ఉన్న చంద్రుడిపై కూడా రూపొందించింది చైనా. బ్రిటన్ శాస్త్రవేత్త కప్ప ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న చైనా ఓ కృత్రిమ చంద్రుడిని రూపొందించింది. టెక్నాలజీలో చైనా వాయువేగంతో దూసుకుపోతూ అద్భుతాలను సృష్టిస్తోంది. అనుకున్నది సాధిస్తోంది. తన విధానాలతో ప్రపంచాన్ని నివ్వేరపోయేలా చేస్తోంది. ఇటీవల 'కృత్రిమ సూర్యుడి'ని 17 నిమిషాల పాటు మండించి డ్రాగన్ శాస్త్రవేత్తలు చరిత్రను తిరగరాసిన చందమామపై ప్రయోగాల్లో మరో అద్భుతం చేసింది. చంద్రమండలంపై పరిస్థితులను అనుకరించేందుకు ఒక బుల్లి చందమామను సృష్టించింది. అంతేకాదు. ఆ చందమామలో గురుత్వాకర్షణ శక్తినీ మాయం చేసింది. ఇటువంటివి బహుశా డ్రాగన్ దేశానికే సాధ్యమేమో. భవిష్యత్‌లో చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేయడానికి వీలుగా ఈ బుల్లి చందమామను సిద్ధం చేసింది చైనా. ఇటువంటి టెక్నాలజితో మరోసారి చైనా ప్రపంచాన్ని నివ్వెరపోయేలా చేసింది. ఇటువంటి సాధనం ప్రపంచంలో మరెక్కడా లేకపోవడం విశేషం. జియాంగ్సు ప్రావిన్స్‌లోని షుజౌ నగరంలో ఏర్పాటు చేసిన ఈ కృత్రిమ చందమామను త్వరలోనే ప్రారంభించే అవకాశం ఉంది. వ్యోమగాములను రోదసిలోకి పంపడానికి ముందు భారరహిత స్థితిలో శిక్షణ ఇవ్వాల్సి ఉంటుంది. ఇందుకోసం ప్రస్తుతం 'జీరో గ్రావిటీ' విమానాలను ఉపయోగిస్తున్నారు. ఈ వాహనాలు ఒక పద్ధతిలో ప్రయాణించే క్రమంలో అందులోని వారు కొద్దిసేపు భారరహిత స్థితికి గురవుతారు. అలాగే డ్రాప్‌ టవర్‌ నుంచి కిందకు జారిపడే క్రమంలోనూ కొన్ని నిమిషాల పాటు ఈ పరిస్థితిని అనుభవించొచ్చు. భూమికి ఉప గ్రహం అయిన చంద్రుడిపై భూమికంటే గురుత్వాకర్షణ శక్తిలో తక్కువే ఉంటుంది. భూమితో పోలిస్తే చంద్రుడిపై గురుత్వాకర్షణ శక్తి 6వ వంతు ఉంటుంది. చైనా సృష్టించిన చందమామలో కూడా ఇటువంటి పరిస్థితులనే సృష్టించారు. చంద్రుడిపై ఉండే గురుత్వాకర్షణ శక్తిని భూమి మీద సృష్టించడం చాలా చాలా కష్టమైన ప్రక్రియ. దాన్ని సుసాధ్యం చేశారు చైనా శాస్త్రవేత్తలు. దీని కోసం శక్తిమంతమైన అయస్కాంతాలను ఉపయోగించారు. ఈ చందమామ 'మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌' ఆధారంగా పనిచేస్తుంది. ఈ బుట్టి చందమామలో 3 చదరపు అడుగుల విస్తీర్ణం కలిగిన ఒక గది, ఒక వాక్యూమ్‌ చాంబర్‌ ఉంటాయి. చంద్రుడి ఉపరితలంపై ఉండే శిలలను కూడా రూపొందించింది చైనా ఈ బుల్లి చందమామపై..దీని కోసం తేలిగ్గా ఉన్న శిలలను ఉపయోగించింది.అలాగే చంద్రుడిపై ఉండే ధూళిని కూడా రూపొందించింది. దీని కోసం ధూళి ఈ గదిని రూపొందించారు. గాలిలేని వాక్యూమ్‌ చాంబర్‌పై ఈ గదిని నిర్మించారు. శక్తిమంతమైన అయస్కాంతాల సాయంతో చాంబర్‌లో అయస్కాంత క్షేత్రాన్ని ఏర్పరిస్తే ఆ గది గాల్లోకి లేస్తుంది. దీంతో ఒరిజినల్ చందమామ ఉన్న పరిస్థితులు ఏర్పడతాయి. కృత్రిమ జాబిల్లి నిర్మాణంలో పలు ఇబ్బందుల్ని అధిగమించడానికి చైనా శాస్త్రవేత్తలు.. అయస్కాంత క్షేత్ర సమక్షంలో చాలా సులువుగా తేలియాడే చంద్రుడి ధూళి కణాలను రూపొందించారు. కీలకమైన పరికరాల్లో ఉక్కు స్థానంలో అల్యూమినియంను ఉపయోగించారు. బరువు తగ్గించటం కోసం అన్నమాట. చంద్రుడిపై విస్తృత పరిశోధనలు చేస్తున్న చైనా ఇప్పటికే పలు కీలక అంశాలను కనుగొంది. ఇంకా పలు విశేషాలను తెలుసుకోవటానికి యత్నిస్తోంది. దీంట్లో భాగంగా..2027 నాటికి చంద్రుడిపై పరిశోధన కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని భావిస్తోంది. చాంగే-6, 7, 8 వ్యోమనౌకల ద్వారా పరిశోధనలు కొనసాగించాలనే యోచనలో ఉంది డ్రాగన్ దేశం. చాంగే-7 వ్యోమనౌకను చంద్రుడి దక్షిణార్థ గోళంలో లాంచ్ చేయటానికి ఇప్పటికే పక్కాగా ప్లాన్ రూపొందించింది. అక్కడితో ఊరుకుంటే అది చైనా ఎందుకవుతుంది అన్నట్లుగా..ఇతర దేశాల కంటే ఉందే..తన సత్తా చాటాలని భావిస్తోంది. 2030 నాటికి మనుషులను పంపాలని లక్ష్యంగా పెట్టుకొంది. ఈ క్రమంలో కృత్రిమ చందమామ సహాయంతో వ్యోమగాములకు మెరుగైన శిక్షణ ఇవ్వడంతో పాటు..కొత్త రోవర్లు, సాంకేతిక పరిజ్ఞానాలను ఈజీగా పరీక్షించటం వంటివి చేస్తోంది. ఫిజిక్స్‌లో నోబుల్ అవార్డు గ్రహీత ఆండ్రే గెయిమ్‌ గతంలో 'మ్యాగ్నెటిక్‌ లెవిటేషన్‌'తో ఒక కప్పను గాల్లోకి లేపారు. చైనా మైనింగ్ అండ్ టెక్నాలజీ యూనివర్సిటీకి చెందిన లీ రుయిలిన్ ఈ పరిశోధనకు నేతృత్వంలో ఆండ్రే గెయిమ్ కప్ప ప్రయోగాన్ని స్ఫూర్తిగా తీసుకున్న చైనా ఈ కృత్రిమ చందమామ సృష్టికి చైనా అదే ప్రయోగాన్ని అనుకరించింది.

Post a Comment

0 Comments

Close Menu