Ad Code

పాత కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకోండి...!


దేశంలో పెట్రోలు, డీజిల్ ధరలు ఆకాశాన్ని తాకుతున్నాయి. అందుకే చాలామంది ఎలక్ట్రిక్ వాహనాల వైపు మొగ్గు చూపుతున్నారు. ఇప్పటికే కారు ఉన్నవారు తమ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చుకునే అవకాశం ఉందని మనలో చాలామందికి తెలియదు. అయితే ఎలక్ట్రిక్ కిట్ ధర చాలా ఎక్కువ. ఇప్పుడు ఈ రకంగా చేయడం ద్వారా భవిష్యత్తులో లక్షల రూపాయలను ఆదా చేసుకోవచ్చు. ఎందుకంటే ఎలక్ట్రిక్ వాహనం నడపడానికి అయ్యే ఖర్చు, వాటి నిర్వహణ చాలా తక్కువ. రూ. 4 నుండి 5 లక్షల ఖర్చుతో మీ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చే పలు కంపెనీలు ఉన్నాయి. వీటి ఖర్చు ఎక్కువగా మోటారు సామర్థ్యం, బ్యాటరీ సామర్థ్యంపై ఆధారపడి ఉంటుంది. 12 kWh లిథియం-అయాన్ బ్యాటరీ, 20 kW ఎలక్ట్రిక్ మోటార్ ధర రూ. 4 లక్షల వరకు ఉంటుంది. పెట్రోల్, డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మార్చడంలో పాల్గొనే చాలా కంపెనీలు హైదరాబాద్‌లో ఉన్నాయి. వీటిలో ఎట్రియో, నార్త్‌వేమ్స్ ప్రముఖమైనవి. ఈ రెండు కంపెనీలు ఏదైనా పెట్రోల్ లేదా డీజిల్ కారును ఎలక్ట్రిక్ కారుగా మారుస్తాయి. ఇది కాకుండా ఇంధన వాహనాలను ఎలక్ట్రిక్ వాహనాలుగా మార్చడానికి పని చేసే అనేక కంపెనీలు ఢిల్లీలోనూ ఉన్నాయి. కార్లలో ఉపయోగించే ఎలక్ట్రిక్ కిట్ దాదాపు ఒక్కటే ఉంటుంది. పెట్రోల్ లేదా డీజిల్ ద్వారా నడిచే కారు కిలోమీటర్‌కు రూ. 6 ఖర్చు అయితే, అదే ఎలక్ట్రిక్ కారుకు అయ్యే ఖర్చు ఒక్క రూపాయికి లోపే ఉంటుంది. కాబట్టి ఈ కార్లను ఎలక్ట్రిక్‌ కారుగా మార్చునేందుకు అయ్యే ఖర్చు కూడా రెండు, మూడు సంవత్సరాల్లో ఆదా చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu