Ad Code

మార్కెట్లోకి హోండా CBR650R 2022


జపాన్ మోటార్ వాహన దిగ్గజం హోండా మోటార్ సైకిల్స్, భారత్ లో ప్రీమియం సెగ్మెంట్ పై దృష్టిపెట్టింది. ఈక్రమంలోనే 300సీసీ అంతకన్నా ఎక్కువ సామర్ధ్యం కలిగిన బైక్ లను భారత మార్కెట్లోకి విడుదల చేస్తుంది హోండా. 2021 డిసెంబర్ లో సీబీ300ఆర్ ను భారత విఫణిలోకి ప్రవేశపెట్టిన హోండా.. నెల రోజుల వ్యవధిలోనే మరో బైక్ ను విడుదల చేసింది. CBR650R బైక్ ను హోండా భారత్ లో విడుదల చేసింది. 650సీసీ సామర్ధ్యం కలిగిన ఈ స్పోర్ట్స్ బైక్ ధరను రూ.9.35 లక్షలు(Ex-Showroom)గా నిర్ణయించింది. భారీ “ప్రైస్ ట్యాగ్”తో వస్తున్న ఆ బైక్ విశేషాలు ఏంటంటే CBR650R గతంలోనే భారత్ లో అందుబాటులో ఉంది. ఆ మోడల్ కె కొత్త సొబగులు అద్ది 2022 మోడల్ గా ప్రవేశపెట్టింది హోండా సంస్థ. 649cc ఇన్‌లైన్-ఫోర్ సిలిండర్(4సిలిండర్) ఇంజన్ కలిగిన ఈ బైక్ 87hp@12,000rpm శక్తిని, 57.5Nm@8,500rpm టార్క్ ని ఉత్పత్తి చేస్తుంది. 2022 మోడల్ లో ఎక్జాస్ట్ ని సరికొత్తగా డిజైన్ చేశారు. ముందూ వెనుక మొత్తం LED లైట్లు అమర్చారు. LCD క్లస్టర్ కి కూడా మెరుగులు దిద్దారు. గ్రాఫిక్స్ హైలట్ గా విడుదలైన ఈ CBR650R 2022 మోడల్.. గ్రాండ్ ప్రిక్స్ రెడ్, మ్యాట్ గన్‌పౌడర్ బ్లాక్ మెటాలిక్ అనీ రెండు కలర్స్ లో మాత్రమే లభిస్తుందని సంస్థ ప్రతినిధులు తెలిపారు. పూర్తిగా ఇంపోర్ట్ చేసుకునే ఈ బైక్.. దేశీయంగా ప్రీమియం సెగ్మెంట్లో వినియోగదారులను ఆకట్టుకుంటుందని సంస్థ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. జనవరి 25 నుంచే ఈ బైక్ బుకింగ్స్ ప్రారంభమయ్యాయి. ఖరీదైన బైక్ కొనాలనుకునే వారు.. ప్రీమియం బైక్ లంటే ఇష్టపడే యువతే లక్ష్యంగా విడుదలైన ఈ బైక్.. kawasaki ninja650, Z650, Aprilia RS 660, CF Moto 650GT వంటి ప్రీమియం బైక్ లకు గట్టి పోటీ ఇవ్వనుంది.

Post a Comment

0 Comments

Close Menu