Ad Code

మెసేజ్ డిలీట్ టైమ్ లిమిట్ 2 రోజులకు పొడిగించే అవకాశం!


ప్రముఖ ఇన్ స్టంట్ మెసేజింగ్ యాప్ వాట్సాప్ సరికొత్త ఫీచర్లతో యూజర్లను ఆకట్టుకుంటోంది. ఇప్పటికే పలు ఫీచర్లను ప్రవేశపెట్టిన వాట్సాప్ కొత్త అప్ డేట్స్ కూడా రిలీజ్ చేస్తోంది. అందులో వాట్సాప్ డిలీట్ ఫర్ ఎవ్రీవన్ ఫీచర్ ఒకటి.. ఇప్పుడు ఈ ఫీచర్ టైమ్ లిమిట్ పొడిగించాలని వాట్సాప్ భావిస్తున్నట్టు ఓ నివేదిక వెల్లడించింది. ప్రస్తుతం కాలపరిమితిని పొడిగించాలని యోచిస్తున్నట్లు సమాచారం. ప్రస్తుత టైమ్ లిమిట్.. ఒక గంట, 8 నిమిషాలు 16 సెకన్లు ఉండగా.. త్వరలో WhatsApp ఆ టైమ్ లిమిట్ కాస్తా రెండు రోజులకు పెంచే అవకాశం ఉంది. మెసేజ్ పంపిన రెండు రోజుల తర్వాత యూజర్లు తమ మెసేజ్‌లను డిలీట్ చేసుకోవచ్చు. ప్రస్తుత టైమ్ లిమిట్ మెసేజ్‌ను పంపిన తర్వాత ఒక గంట, 8 నిమిషాలు, 16 సెకన్ల తర్వాత మాత్రమే ఆయా మెసేజ్ లను డిలీట్ చేసేందుకు యూజర్లకు వాట్సాప్ అనుమతిస్తుంది. వాట్సాప్ ఫీచర్స్ ట్రాకర్ Wabetainfo నివేదిక ప్రకారం.. వాట్సాప్ ‘Delete for Everyone’ టైమ్ లిమిట్.. ఒక గంట, ఎనిమిది నిమిషాలు, 16 సెకన్ల నుంచి రెండు రోజుల 12 గంటల వరకు పెంచాలని వాట్సాప్ భావిస్తోంది. వాట్సాప్ ఫీచర్‌ను విడుదల చేస్తే.. యూజర్లు తమ మెసేజ్‌లను పంపిన రెండు రోజుల తర్వాత కూడా చాట్ నుంచి డిలీట్ చేసుకోవచ్చు. ఇంతకుముందు వాట్సాప్ టైమ్ లిమిట్ ను ఒక వారానికి పెంచాలని భావించంది. అయితే వాట్సాప్ ఈ ఫీచర్‌ను టెస్టు చేయడం ఆపివేసినట్లు కనిపిస్తోంది. వాట్సాప్ iMessage-వంటి మెసేజ్ ఫీచర్‌ను మళ్లీ టెస్టింగ్ చేసే అవకాశం ఉంది. Wabetainfo ప్రకారం.. WhatsApp Android, iOS WhatsApp బీటా కొత్త అప్‌డేట్‌లో message reactions feature (ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్షన్ ద్వారా సేఫ్) రెడీ చేస్తోంది వాట్సాప్ ఈ ఫీచర్‌ను విడుదల చేసిన తర్వాత అది ఎలా ఉంటుందో స్క్రీన్‌షాట్‌ను కూడా షేర్ చేసింది టిప్‌స్టర్. మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ అందుబాటులో ఉన్న ఎమోజీలతో మెసేజ్ లకు రెస్పాండ్ అయ్యేందుకు వినియోగదారులను అనుమతిస్తుంది. ఎమోజీని ఎంచుకుని వాటిని యూజర్లు పంపుకోవచ్చు. కేవలం మెసేజ్‌పై నొక్కితే చాలు. iMessageలో మాదిరి ఉండే మెసేజ్ రియాక్షన్స్ ఫీచర్ అందుబాటులోకి వచ్చింది. మెసేజ్ రియాక్షన్‌లు ఎండ్-టు-ఎండ్ ఎన్‌క్రిప్ట్ చేసి ఉంటాయని Wabetanifo గతంలోనే వెల్లడించింది, చాట్ బయట్ ఎవరూ రియాక్షన్స్ చూడలేరు. ఆయా మెసేజ్ లకు అనేక రియాక్షన్స్ ఉండవచ్చు, మీకు 999 కంటే ఎక్కువ రియాక్షన్స్ వస్తే.. అప్పుడు మీకు “999+” కనిపిస్తుంది. ముఖ్యంగా గ్రూప్ చాట్‌లకు మాత్రమే వర్తిస్తుందని నివేదిక పేర్కొంది. ఈ ఫీచర్ ప్రారంభంలో పరిమిత ఎమోజీలను మాత్రమే రిలీజ్ చేస్తోంది. కానీ కాలక్రమేణా ఎమోజీల సంఖ్యను పెంచనుంది. ఈ ఫీచర్ iOS, Android యూజర్లకు అందుబాటులోకి తీసుకురానుంది.

Post a Comment

0 Comments

Close Menu