Ad Code

రూ.395కే 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్!


జియో తక్కువ ధరకే ఎక్కువ బెనిఫిట్లను అందించడానికిఎప్పటికప్పుడు తన ప్లాన్లను అప్ డేట్ చేస్తూ ఉంటోంది. అయితే ఇప్పుడు అన్ని టెలికాం కంపెనీలు 84 రోజుల వ్యాలిడిటీతో అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయాన్ని అందిస్తున్నాయి. మిగతా టెలికాం కంపెనీలతో పోల్చితే అత్యంత తక్కువ రూ. 395కే 84 రోజుల పాటు వ్యాలిడిటీ అందించే ప్లాన్ ను అందిస్తోంది జియో. ఈ ప్లాన్ తో 6GB డేటా లభిస్తుంది. 1000 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి. అన్ లిమిటెడ్ కాలింగ్ సదుపాయం లభిస్తుంది. డేటా తక్కువగా వాడే వారికి ఇది బెస్ట్ ప్లాన్ గా చెప్పొచ్చు. రూ. 719 ప్లాన్ ను ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీ లభిస్తుంది. ఇంకా నిత్యం 2 జీబీ డేటా లభిస్తుంది. ప్రతిరోజూ 100 ఉచిత SMSలు మరియు Jio యాప్‌ల ఉచిత సబ్‌స్క్రిప్షన్ లభిస్తుంది. రూ. 666 ప్లాన్ ఎంచుకున్న వినియోగదారులకు 84 రోజుల వ్యాలిడిటీతో నిత్యం 1.5 జీబీ డేటా లభిస్తుంది. మొత్తం 126GB డేటాను పొందుతారు. ఈ ప్లాన్‌లో అపరిమిత కాలింగ్ లభిస్తుంది. దీంతో పాటు, రోజువారీ 100 ఉచిత SMSలు లభిస్తాయి. రూ. 296 ప్లాన్ 30 రోజుల వ్యాడిటీతో ఈ ప్లాన్ ను అందిస్తోంది జియో. ఎంచుకున్న వినియోగదారులకు 25 జీబీ డేటా లభిస్తుంది. అన్ లిమిటెడ్ కాలింగ్ తో పాటు నిత్యం 100 ఎస్ఎంఎస్ లు లభిస్తాయి.

Post a Comment

0 Comments

Close Menu