Ad Code

మోటరోలా ఎడ్జ్ సిరీస్ లాంచ్‌ ముహూర్తం ఖరారు


భారత్‌లో మోటరోలా ఎడ్జ్ సిరీస్ లాంచ్‌కు ముహూర్తం ఖరారు అయింది. మోటరోలా ఎడ్జ్ 30 ప్రో పేరుతో స్మార్ట్‌ఫోన్‌ను ఈనెల 24న లాంచ్ చేయనున్నారు. గత నెలలోనే మోటరోలా ఎడ్జ్ 30 ప్రో స్మార్ట్‌ఫోన్‌ను ప్రపంచ మార్కెట్‌లో లాంచ్ చేయాల్సి ఉంది కానీ.. విడుదలను వాయిదా వేసింది మోటరోలా. ఇదే ఫోన్‌ను రీబ్రాండ్ పేరుతో మోటో ఎడ్జ్ ఎక్స్ 30 గా పేరు మార్చి గత సంత్సరమే చైనాలో రిలీజ్ చేశారు. ఇప్పుడు ఆ మోటో ఎడ్జ్ ఎక్స్ 30 ఫోన్‌నే మోటరోలా ఎడ్జ్ 30 ప్రో పేరుతో భారత మార్కెట్‌లో ఈనెల 24న మోటరోలా సంస్థ లాంచ్ చేయనుంది. స్నాప్‌డ్రాగన్ 8 జెన్ 1 ఎస్‌వోసీ ప్రాసెసర్‌, 12 జీబీ ర్యామ్, ఆండ్రాయిడ్ 12 ఓఎస్‌, 6.7 ఇంచ్ ఫుల్ హెచ్‌డీ ప్లస్ పీవోఎల్ఈడీ డిస్‌ప్లే, 144 హెచ్‌జెడ్ రీఫ్రెష్ రేట్‌, హెచ్‌డీఆర్ 10 ప్లస్ సపోర్ట్‌, 50 ఎంపీ రేర్ కెమెరా, 60 ఎంపీ సెల్ఫీ సెన్సార్‌, 5000 ఎంఏహెచ్ బ్యాటరీ, 68 వాట్స్ ఫాస్ట్ చార్జింగ్ లాంటి ఫీచర్లతో ఈ ఫోన్ లాంచ్ కానుంది.

Post a Comment

0 Comments

Close Menu