Ad Code

స్నాప్‌చాట్‌లో కొత్త ఫీచర్...!


స్నాప్ చాట్ కంపెనీ యూజర్ల కోసం కొత్త ఫీచర్ అందుబాటులోకి తీసుకొస్తోంది.ఈ కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ యూజర్లు తమ అకౌంట్ లోని యూజర్ నేమ్ ను  సులభంగా మార్చుకోవచ్చు. ఈ సరికొత్త ఫీచర్ త్వరలోనే రిలీజ్ చేసేందుకు స్నాప్ చాట్ కంపెనీ ప్లాన్ చేస్తోంది. స్నాప్ చాట్ అకౌంట్లో యూజర్ నేమ్ మార్చుకునే అవకాశం లేదు. కొత్త ఫీచర్ ద్వారా స్నాప్ చాట్ యూజర్లు వెంటనే యూజర్ నేమ్ మార్చుకోవచ్చు. ప్రత్యేకించి కొత్త స్నాప్ చాట్ అకౌంట్ క్రియేట్ చేయాల్సి న పనిలేదు. ఇప్పటికీ పాత ఫ్రెండ్స్ లిస్ట్, స్నాప్ స్కోర్‌లు, స్నాప్ కోడ్‌లు, మెమెరీస్‌ వంటి ఆప్షన్లను యాక్సస్ చేసుకోవచ్చు. ఈ ఫీచర్ ఫిబ్రవరి 23 నుంచి అందుబాటులోకి వస్తుందని ఓ నివేదిక వెల్లడించింది. ప్రపంచవ్యాప్తంగా iOS, Android యూజర్లకు ఈ కొత్త ఫీచర్ అందుబాటులోకి రానుంది. అయితే, స్నాప్ చాట్‌లో ఇతరుల యూజర్ నేమ్ మార్చుకోవడానికి ఏడాదిలో ఒకసారి మాత్రమే క్రియేట్ చేసుకునే వీలుంది. మీరు ఏడాదిలో మీ స్నాప్ చాట్ అకౌంట్ యూజర్ నేమ్ ఒకసారి మాత్రమే వినియోగించుకోగలరు. మీరు ఇతర స్నాప్ చాట్ యూజర్లు ఉపయోగించిన యూజర్ల నేమ్ అంగీకరించదు. మీ యూజర్ నేమ్ మార్చిన తర్వాత.. మీ పాత యూజర్లో పేరుపై కనిపించే ఆప్షన్ ఇకపై మీకు కనిపించదు. మీ Snapchat యూజర్ నేమ్ మార్చిన తర్వాత, అందరికీ ఎప్పటికీ అందుబాటులో ఉండదు. స్నాప్‌చాట్ కంపెనీ అధికారి ఒకరు మాట్లాడుతూ.. స్నాప్ చాట్‌లో ఇదో అద్బుతమైన ఫీచర్. ఇది వినియోగదారులను మరింత ఆకట్టుకోనుంది. తమ పాత యూజర్‌నేమ్‌తో విసిగిపోయిన వారు ఈ ఆప్షన్ ద్వారా యూజర్ నేమ్ మార్చుకోవచ్చు. ఈ కొత్త ఫీచర్ గతంలో ఆస్ట్రేలియాలోని స్నాప్ చాట్ యూజర్లకు మాత్రమే అందుబాటులో ఉండేది. టిక్‌టాక్, ఇన్‌స్టాగ్రామ్, ట్విట్టర్ వంటి ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లు ఇప్పటికే వినియోగదారు పేర్లను మార్చుకునే అవకాశాన్ని అందిస్తున్నాయి. స్నాప్‌చాట్‌లో యూజర్ నేమ్ మార్చాలనుకుంటే.. మీరు ముందుగా స్క్రీన్‌పై ఎడమవైపు టాప్ కార్నర్ లో చూడండి.. అక్కడ మీకు Bitmoji ఐకాన్ కనిపిస్తుంది దానిపై నొక్కండి. ఆపై, ప్రొఫైల్ సెక్షన్‌కు వెళ్లండి > గేర్ ఐకాన్ ప్రెస్ చేసి ఆయా సెట్టింగ్‌లను ఎంచుకోవచ్చు. ఇక్కడే మీకు స్నాప్ చాట్ 'Username' అనే ఆప్షన్ కనిపిస్తుంది. ఆ ఐకాన్‌పై నొక్కండి. అక్కడే మీకు Username Change అనే మార్చు బటన్‌ను కనిపిస్తుంది. మీరు కొత్త యూజర్ నేమ్ ఎంటర్ చేయాల్సి ఉంటుంది. అలాగే Changes బటన్ కోసం  ద్వారా మార్చుకోవచ్చు. మళ్లీ నొక్కగానే మీ యూజర్ నేమ్ కనిపిస్తుంది. స్నాప్ చాట్ యూజర్ల కోసం కంపెనీ మిడ్ రోల్ యాడ్స్ షేర్ చేసింది. Snapchat యూజర్ల కోసం స్టోరీలలో మిడ్-రోల్ యాడ్స్ డిస్ ప్లే చేస్తామని కంపెనీ ప్రకటించిన కొన్ని రోజుల తర్వాత ఈ వార్త వెలుగులోకి వచ్చింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా కొంత డబ్బులు కూడా సంపాదించుకోవచ్చు. ప్రస్తుతం ఈ కొత్త ఫీచర్ బీటా వెర్షన్‌లో అందుబాటులో ఉంది స్నాప్ స్టార్ స్టేటస్ వద్ద మాత్రమే యూజర్లకు ఈ కొత్త ఫీచర్ కనిపించనుంది.

Post a Comment

0 Comments

Close Menu