Ad Code

ఈ బైక్ తయారు చేసిన హైదరాబాద్ కుర్రాళ్లు


గ్రావ్టన్ మోటార్స్ ప్రైవేట్ లిమిటెడ్ అనే హైదరాబాద్ స్టార్టప్ కంపెనీ విద్యార్థులు తయారుచేసిన ఎలక్ట్రిక్ బైక్ గురించి తెలుసుకున్న ఐటీ మంత్రి కేటీఆర్ విద్యార్థుల బృందానికి అభినందనలు తెలిపారు. తెలంగాణలో తొలి ఈ-బైక్ రూపొందిన గ్రావ్టన్ మోటార్స్ రీసెంట్ గా దాన్ని విడుదల చేసింది. ఎలక్ట్రిక్ బైక్ తయారు చేసిన టీమ్ లో సిరిసిల్లకు చెందిన యువకులు కూడా ఉన్నారని తెలిసిన కేటీఆర్ ట్విట్టర్ లో కంగ్రాట్స్ చెప్తూ మా ప్రాంతం పిల్లలున్నందుకు గర్వంగా ఉంది అంటూ కామెంట్ చేశారు.  దీన్ని తయారు చేసిన బృందం ఈ బైక్ మీద కన్యాకుమారి నుంచి లడఖ్ లోని ఖర్దూంగ్ వరకు నాన్ స్టాప్ గా రైడ్ చేసి మరో రికార్డు కూడా సృష్టించింది. క్వాంటా పేరుతో మార్కెట్లోకి ప్రవేశపెట్టిన ఈ ఎలక్ట్రిక్ బైక్ ధర కేవలం రూ.80 ఖర్చుతో 800 కిలోమీటర్ల మైలేజి ఇస్తుందని కంపెనీ తెలిపింది. ప్రమోషనల్‌ ఆఫర్‌ ధరను రూ.99,000గా నిర్ణయించింది. తెలంగాణ సర్కార్ గో ఎలక్ట్రిక్‌ ప్లాట్‌ఫామ్‌లో ఎలక్ట్రిక్ బైక్ 'క్వాంటా'ను రాష్ట్ర పరిశ్రమలు, ఐటీ ముఖ్య కార్యదర్శి జయేష్‌రంజన్‌ ఆవిష్కరించారు. బీఎల్‌డీసీ మోటర్‌తో గంటకు 70 కిలోమీటర్ల వేగం. ఒక్కసారి ఛార్జ్‌చేస్తే 150 నుంచి 320 కిలోమీటర్ల ప్రయాణం. ఫాస్ట్‌ ఛార్జింగ్‌ మోడ్‌లో 90 నిముషాల్లో బ్యాటరీ ఫుల్ ఛార్జింగ్‌ అవుతుంది. రోడ్‌సైడ్‌ అసిస్టెన్స్‌, మ్యాపింగ్‌ సర్వీస్‌ స్టేషన్స్‌, రిమోట్‌ లాక్‌/ఆన్‌లాక్‌ ఫీచర్లతో స్మార్ట్‌ యాప్‌ మూడు రంగుల్లో లభ్యమయ్యే ఈ బైక్‌ను కంపెనీ వెబ్‌సైట్‌లో బుక్‌ చేసుకోవచ్చు.

Post a Comment

0 Comments

Close Menu