Ad Code

అమెజాన్ మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డేస్ ప్రారంభం !

 

ప్రముఖ ఈకామర్స్ సంస్థ అమెజాన్ నుంచి సరికొత్త సేల్ ప్రారంభమయింది. అమెజాన్ మొబైల్ అండ్ టీవీ సేవింగ్స్ డేస్ పేరుతో ఈ సేల్‌ను ఫిబ్రవరి 12 నుంచి 15 వరకు ఈ సేల్ నడవనుంది. ఈ సేల్‌లో ప్రధానంగా స్మార్ట్‌ఫోన్లు, స్మార్ట్ టీవీలపై ప్రత్యేకమైన డిస్కౌంట్లను అమెజాన్ అందిస్తోంది. ప్రముఖ స్మార్ట్‌ఫోన్ బ్రాండ్స్ సామ్‌సంగ్‌, వన్‌ప్లస్‌, జియోమీ, రియల్‌మీ, ఒప్పో, టెక్నో లాంటి స్మార్ట్‌ఫోన్ల మీద భారీ ఆఫర్లను ప్రకటించారు. అలాగే.. స్మార్ట్ టీవీ బ్రాండ్స్ అమెజాన్ బేసిక్స్, సామ్‌సంగ్‌, హిసెన్స్, సోనీ, జియోమీ బ్రాండ్స్ మీద కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. రెడ్‌మీ నోట్ 11టీ 5జీ ఫోన్‌ను ఈ సేల్‌లో రూ.19,999కే సొంతం చేసుకోవచ్చు. నోట్ 11టీ 5జీ ఫోన్ అసలు ధర రూ.22,999. అలాగే ఎంఐ 11ఎక్స్ మీద రూ.6000 డిస్కౌంట్ లభించనుంది. ఎక్స్‌ఛేంజ్ ఆఫర్ కింద మరో రూ.3000 డిస్కౌంట్ అందించనున్నారు. రూ.25,999కే ఎంఐ 11ఎక్స్ ఫోన్ లభించనుంది. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం52 5జీ ఫోన్‌ను రూ.22,999కే అందిస్తున్నారు. ఎం52 5జీ ఫోన్ అసలు ధర రూ.34,999గా ఉంది. దానితో పాటు క్రెడిట్ కార్డ్స్ ద్వారా 10 శాతం అదనపు డిస్కౌంట్ లభిస్తుంది. అలాగే.. సామ్‌సంగ్ గెలాక్సీ ఎం32 5జీ ఫోన్‌ను రూ.20,999కే అందిస్తున్నారు. దాని అసలు ధర రూ.23,999. ఐక్యూ జెడ్‌5, ఐక్యూ 7, ఒప్పో ఏ15ఎస్‌, రియల్‌మీ నార్జో 50ఏ, టెక్నో పాప్ 5 ఎల్‌టీఈ ఫోన్ల మీద కూడా భారీ డిస్కౌంట్లను అందిస్తున్నారు. 32 ఇంచ్ రెడ్‌మీ టీవీ అసలు ధర రూ.14,998 ఉండగా.. రూ.10,001 కే అందిస్తున్నారు. 50 ఇంచుల రెడ్‌మీ టీవీని రూ.34,998 కే అందిస్తున్నారు. దాని అసలు ధర రూ.44,999. 32 ఇంచుల ఎంఐ హారిజాన్ ఫుల్ హెచ్‌డీ టీవీని రూ.3500 డిస్కౌంట్‌తో ధర రూ.16,499 కే అందిస్తున్నారు. సామ్‌సంగ్ 43 ఇంచుల క్రిస్టల్ 4కే ప్రో యూహెచ్‌డీ టీవీ అసలు ధర రూ.52,900 ఉండగా.. రూ.36,990కే అందిస్తున్నారు. వన్‌ప్లస్ టీవీని రూ.3500 డిస్కౌంట్‌తో రూ.16,499కే అందిస్తున్నారు. 50 ఇంచుల అమెజాన్ బేసిక్స్ 4కే టీవీని రూ.23,001కే అందిస్తున్నారు. దాని అసలు ధర రూ.32,999. సోనీ ప్రీమియం 55 ఇంచుల 4కే యూహెచ్‌డీ గూగుల్ టీవీని 30 శాతం డిస్కౌంట్‌తో రూ.33,910కే అందిస్తున్నారు. దాని అసలు ధర రూ.75,990.


Post a Comment

0 Comments

Close Menu