Ad Code

జూనియర్ ఎన్టీఆర్ తో నటించాలని ఉంది


బాలీవుడ్ స్టార్ హీరోయిన్ దీపికా పదుకొణే. తమ సినిమాలో హీరోయిన్ గా పెట్టుకోవాలని స్టార్ హీరోలంతా భావిస్తుంటారు. బాలీవుడ్ నుంచే కాకుండా కోలీవుడ్, టాలీవుడ్ ల నుంచి కూడా ఆఫర్లు వస్తుంటాయి. ప్రస్తుతం బాలీవుడ్ ఆసక్తిగా చూస్తున్న సినిమా 'గెహ్రైయాన్' రొమాంటిక్ లవ్ స్టోరిగా ఈ సినిమా విడుదలకు సిద్దంగా ఉంది. ఈచిత్ర ప్రమోషన్లలో పాల్గొటుంది దీపిక. మీరు ఏ స్టార్ తో ఇప్పటి వరకు వర్క్ చేయలేదు.. అవకాశం వస్తే ఎవరితో పని చేసేందుకు సిద్దంగా ఉన్నారంటూ ఓ అభిమాని అడిగాడు. తన అభిమాని అడిగిన ఈ ప్రశ్నకు దీపికా జూనియర్ ఎన్టీఆర్ పేరును చెప్పింది. జూనియర్ అద్భుతమైన వ్యక్తి అంటూ కితాబు ఇచ్చింది. భవిష్యత్తులో జూనియర్ ఎన్టీఆర్ తో స్క్రీన్ షేర్ చేసుకుంటే చాలా సంతోషిస్తానని అన్నారు. ప్రస్తుతం టాలీవుడ్ సినిమాలు ప్యాన్ ఇండియా రేంజ్ లో దుమ్మురేపుతున్నాయి. దీాంతో బాలీవుడ్ హీరోయిన్లు కూడా సౌత్ స్టార్స్ తో నటించేందుకు ఎక్కువ ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 

Post a Comment

0 Comments

Close Menu