Ad Code

అమెజాన్, ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ ఆఫర్



ప్రస్తుతం ఐఫోన్ 13 సిరీస్ అందుబాటులో ఉంది. దీంతో పాత ఐఫోన్ మోడల్స్ ధర తగ్గడం లేదా భారీ డిస్కౌంట్‌తో లభించడం యాపిల్ ఫ్యాన్స్‌ను ఆకట్టుకుంటోంది. యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌పై అదిరిపోయే ఆఫర్ లభిస్తోంది. కేవలం రూ.31,000 ధరకే ఐఫోన్ 11 సొంతం చేసుకోవచ్చు. యాపిల్ నుంచి మూడేళ్ల క్రితం ఐఫోన్ 11 రిలీజ్ అయిన సంగతి తెలిసిందే. ఐఫోన్ 11 ప్రస్తుత ధరలు చూస్తే 64జీబీ వేరియంట్ ధర రూ.49,900. మూడేళ్ల క్రితం ఈ స్మార్ట్‌ఫోన్ రిలీజ్ అయినప్పుడు ధర రూ.64,900 గా ఉన్న సంగతి తెలిసిందే. ఇప్పుడు 64జీబీ వేరియంట్ ధర రూ.49,900 కాగా, 128జీబీ వేరియంట్ ధర రూ.54,900. ఇక హైఎండ్ వేరియంట్ 256జీబీ ధర రూ.64,900. ఈ స్మార్ట్‌ఫోన్‌పై ఎక్స్‌ఛేంజ్ ఆఫర్, బ్యాంక్ డిస్కౌంట్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. అమెజాన్ ఇండియాలో రూ.15,000 వరకు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ పొందొచ్చు. మీ పాత స్మార్ట్‌ఫోన్‌కు ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ వర్తిస్తే మీరు రూ.34,900 చెల్లిస్తే చాలు. ఇక ఐసీఐసీఐ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్, కొటక్ బ్యాంక్ క్రెడిట్ కార్డ్, ఎస్‌బీఐ క్రెడిట్ కార్డ్‌తో కొంటే రూ.4,000 డిస్కౌంట్ లభిస్తుంది. అమెజాన్‌లో ఎక్స్‌చేంజ్ డిస్కౌంట్, బ్యాంక్ డిస్కౌంట్ కలిపితే ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ 64జీబీ వేరియంట్‌ను రూ.30,900 ధరకే సొంతం చేసుకోవచ్చు. ఇక ఫ్లిప్‌కార్ట్‌లో ఐఫోన్ 11 ధరలు ఇలాగే ఉన్నాయి. ఫ్లిప్‌కార్ట్‌లో అయితే ఏకంగా రూ.18,850 ఎక్స్‌ఛేంజ్ డిస్కౌంట్ ఆఫర్ ఉండటం విశేషం. కాబట్టి రూ.31,050 చెల్లిస్తే చాలు. బ్యాంక్ ఆఫర్స్ ఏమీ లేవు. అయితే ఫ్లిప్‌కార్ట్ యాక్సిస్ బ్యాంక్ క్రెడిట్ కార్డుతో కొంటే 5 శాతం అన్‌లిమిటెడ్ క్యాష్‌బ్యాక్ లభిస్తుంది. ఈ ఆఫర్‌తో రూ.30,000 ధరకే ఐఫోన్ 11 కొనొచ్చు. యాపిల్ ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ డీటెయిల్డ్ స్పెసిఫికేషన్స్ చూస్తే 6.1 అంగుళాల లిక్విడ్ రెటీనా డిస్‌ప్లే ఉంది. ఐఫోన్ 11 యాపిల్ ఏ13 బయోనిక్ ప్రాసెసర్‌తో పనిచేస్తుంది. బ్యాటరీ కెపాసిటీ 3,110 ఎంఏహెచ్. ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్‌లో 12+12 మెగాపిక్సెల్ డ్యూయెల్ రియర్ కెమెరా కెపాసిటీ ఉంది. రియర్ కెమెరాలో పోర్ట్‌రైట్, అడ్వాన్స్‌డ్ బొకే, డెప్త్ కంట్రోల్, పనోరమా, నైట్ మోడ్, ఆటో ఇమేజ్ స్టెబిలైజేషన్, బరస్ట్ మోడ్ లాంటి ఫీచర్స్ ఉన్నాయి. సెల్ఫీలు, వీడియో కాల్స్ కోసం 12 మెగాపిక్సెల్ ఫ్రంట్ కెమెరా ఉంది.  ఐఫోన్ 11 స్మార్ట్‌ఫోన్ ఐఓఎస్ 14.2 ఆపరేటింగ్ సిస్టమ్‌తో పనిచేస్తుంది. ఈ స్మార్ట్‌ఫోన్ 6 కలర్స్‌లో అందుబాటులో ఉండటం విశేషం. వైట్, పర్పుల్, గ్రీన్, యెల్లో, బ్లాక్, రెడ్ కలర్స్‌లో కొనొచ్చు. బాక్యులో పవర్ అడాప్టర్, ఇయర్‌పాడ్స్ ఉండవు. వీటిని వేరుగా కొనాల్సి ఉంటుంది. 

Post a Comment

0 Comments

Close Menu