Ad Code

యాపిల్ వాచ్ వాడుతున్నారా?


యాపిల్ వాచ్ ను ఎలాగైనా సరే సొంతం చేసుకోవాలని చాలా మంది చూస్తూ ఉంటారు. అటువంటి వారికి ధర విషయంలో కాస్త ఇబ్బంది కలిగినా ఇందులో ఉండే ఫీచర్స్ మాత్రం చాలా అద్భుతంగా ఉంటాయి. దీంట్లో ఉండే హై క్వాలిటీ సెన్సార్లు మన హెల్త్‌ను మానిటర్ చేస్తూ.. అనారోగ్యాలకు సంబంధించిన నోటిఫికేషన్లు కూడా పంపిస్తాయి. ఇలాంటి ప్రీమియం స్మార్ట్ వాచ్‌లు చాలా సందర్భాల్లో వ్యక్తుల ప్రాణాలు సైతం కాపాడాయి. కానీ ఈ యాపిల్ వాచ్ వల్ల తన ఆరోగ్యానికి నష్టం జరిగిందని అంటోంది ఆస్ట్రేలియాకు చెందిన 21 ఏళ్ల లారెన్ అనే యువతి. లారెన్ ఓ మెడికల్ స్టూడెంట్. సిడ్నీలో ఉంటోంది. ఆమెకు కొన్ని రోజుల కిందట థైరాయిడ్ ఎటాక్ అయింది. ఆమెకు యాపిల్ వాచ్ ఉంది. కానీ థైరాయిడ్ సమస్యను ఆ వాచ్ గుర్తించలేదని ఆమె ఫిర్యాదు చేస్తోంది. తన శరీరంలో కానీ కొన్ని రకాల మార్పులు ఆమెకు కనిపించడంతో ఆమె డాక్టర్ ను సంప్రదించింది. టెస్టుల తర్వాత ఆమెకు థైరాయిడ్ ఉన్నట్లు వైద్యులు తెలిపారు. మొత్తానికి లారెన్‌కు అరుదైన థైరాయిడ్ హెమియాజెనిసిస్ ఉన్నట్లు తేలింది. అయితే యాపిల్ వాచ్‌లో హెల్త్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకోకపోవడం వల్లే ఈ ప్రాబ్లమ్‌ను తాను గుర్తించలేకపోయినట్లు ఆమె గుర్తించింది. ప్రస్తుతం లారెన్ యాపిల్ వాచ్ ను వాడే ప్రతి ఒక్కరూ హెల్త్ నోటిఫికేషన్లను ఎనేబుల్ చేసుకోమని సూచిస్తుంది. హెల్త్ నోటిఫికేషన్స్ ఆన్ చేసుకుంటే మన బాడీలో జరిగే అన్ని రకాల విషయాలు మనకు తెలుస్తాయని ఆమె చెబుతోంది. ఇందుకు సంబంధించి లారెన్ ఒక వీడియోను కూడా విడుదల చేసింది. ఈ వాచ్ కు సంబంధించిన ఒక చార్ట్ ను కూడా చూపించింది. యాపిల్ వాచ్ లో హెల్త్ నోటిఫికేషన్లను ఎనేబుల్ చేసుకోవాలని తెలిపింది. యాపిల్ వాచ్ లో హార్ట్ నోటిఫికేషన్లను ఎనేబుల్ చేసుకోవడానికి యాపిల్ వాచ్ యాప్‌ను యాపిల్ ఫోన్‌లో ఓపెన్ చేయండి. స్క్రీన్ మీద వచ్చే ఆప్షన్లను ఫాలో అవ్వండి. ముందు బ్లడ్ అండ్ ఆక్సిజన్ అనే ఆప్షన్ మీద క్లిక్ చేయండి. ఈ స్టెప్స్ పూర్తి చేసిన తర్వాత మీ యాపిల్ వాచ్‌ను ఓపెన్ చేసి బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్ ఈజీగా చూసుకోవచ్చు. బ్లడ్ ఆక్సిజన్ యాప్ ద్వారా బ్లడ్, ఆక్సిజన్ లెవల్స్​ను చూసుకోవచ్చు. ఆక్సిజన్ లెవల్స్​ను చూసుకునే ముందు మీ యాపిల్ వాచ్ మీ మణికట్టుకు సరిగ్గా ఉందా అని చూసుకోండి. యాప్​లో బ్లడ్ ఆక్సిజన్ లెవల్స్​ను స్టార్ట్ చేసి 15 సెకండ్ల పాటు మీ చేతిని అలాగే ఎటూ కదలకుండా ఉంచండి. ఇలా చేయడం వలన మీ బాడీలో ఉన్న ఆక్సిజన్ మెజర్​మెంట్స్ మీకు స్క్రీన్ మీద డిస్ ప్లే అవుతాయి.

Post a Comment

0 Comments

Close Menu