Ad Code

అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్న ముకేశ్ అంబానీ


ప్రపంచ అపరకుబేరుల్లో ఒకరైన రిలయన్స్ అధినేత ముకేశ్ అంబానీ అత్యంత ఖరీదైన కారును సొంతం చేసుకున్నారు. జనవరి 31న దక్షిణ ముంబైలోని టార్డియో ప్రాంతీయ రవాణా కార్యాలయంలో రిలయన్స్ సంస్థ పేరుమీద రిజిస్టర్ అయిన ఆ కారు ధర చూసి ఆర్టీఓ అధికారులు సైతం నోరెళ్లబెట్టారంట. ఇంతవరకు తాము ఇంత ఖరీదైన కారుని రిజిస్ట్రేషన్ చేసిన దాఖలాలు లేవని అధికారులు చెప్పుకొచ్చారు. అంతే కాదు.. కారు రిజిస్ట్రేషన్, రోడ్ టాక్స్, ఇతర టాక్స్ ల కోసం.. రిలయన్స్ ప్రతినిధులు ఎంత ఖర్చు చేసిందీ ఆర్టీఓ అధికారులు మీడియాకు వెల్లడించారు. ప్రపంచంలోనే విలాసవంతమైన కారులు తయారు చేసే “రోల్స్ రోయ్స్” సంస్థ తయారు చేసిన “కల్లినాన్” అనే కారును.. ముకేశ్ అంబానీ.. తన అభిరుచికి తగ్గట్టుగా ప్రత్యేకంగా తయారు చేయించారట. కారు అసలు ధర భారత్ లో దాదాపు రూ. 6.95 కోట్లు కాగా..అంబానీ తనకు తగ్గట్లుగా మార్పులు చేయించుకోవడంతో ఆ ధర రెట్టింపై రూ.13.14 కోట్లకు చేరింది. ఈ కారును విదేశాల నుంచి ఆర్డర్ పై ఇంపోర్ట్ చేసుకోవాల్సి ఉంటుంది. కారు రోడ్డు ట్యాక్సే ఏకంగా రూ.20 లక్షలు ఉంది. అదనంగా రోడ్ సేఫ్టీ టాక్స్ మరో రూ.40 వేలు కూడా రిలయన్స్ ప్రతినిధులు చెలించినట్లు ఆర్టీఓ అధికారులు వెల్లడించారు. తమ అధినేతకు ఎంతో ఇష్టమైన ఒకటో నెంబర్ రిజిస్ట్రేషన్ ప్లేట్ కోసం మరో మెట్టు ఎక్కారు రిలయన్స్ ప్రతినిధులు. ముకేశ్ అంబానీ తన వ్యక్తిగత కారులన్నింటికీ ఒకటో నెంబర్ రిజిస్ట్రేషన్ ప్లేట్ ఉండేలా చూసుకుంటారు. అందుకోసం ఆర్టీఓకు ఎంత వెచ్చించైనా ఆ నెంబర్ ని సొంతం చేసుకుంటారు. ఇక కొత్తగా కొన్న ఈ కారుకి కూడా ఒకటో నెంబర్ వచ్చేలా రిజిస్ట్రేషన్ చేశారు. అందుకోసం రూ.12 లక్షల రూపాయలు ఆర్టీఓకి చెల్లించారు రిలయన్స్ ప్రతినిధులు. సాధారణంగా “1” నెంబర్ ప్లేట్ ధర గరిష్టంగా రూ.4 లక్షలు ఉంటుంది. అయితే టార్డియో రవాణా కార్యాలయం పరిధిలో ప్రస్తుతం ఉన్న సిరీస్ లో “1” నెంబర్ ప్లేట్ అమ్ముడైపోయింది. దీంతో అంబానీ కోసం ఏకంగా కొత్త నెంబర్ సిరీస్ ను ఓపెన్ చేశారు ఆర్టీఓ అధికారులు. 2018లో భారత్ లో విడుదలైన ఈ కల్లినాన్ ” 6749సీసీ సామర్ధ్యంతో V12 ఇంజిన్ తో వస్తుంది. 563 bhp పవర్ ను 850 Nm టార్క్ ను ఉత్పత్తి చేసే ఈ కారు గరిష్టంగా 250 కిలోమీటర్ల వేగంతో ప్రయాణించగలదు.

Post a Comment

0 Comments

Close Menu