DIZO పవర్ ఫుల్ బ్లూటూత్ నెక్ బ్యాండ్ లాంచ్!

 

Realme అనుబంధ సంస్థ DIZO లేటెస్ట్ గా DIZO Wireless Power with ENC బ్లూటూత్ నెక్ బ్యాండ్ ను విడుదల చేసింది. ఈ బ్లూటూత్ నెక్ బ్యాండ్ ను 88 మిల్లీ సెకెండ్స్ సూపర్ లో లెటెన్సీ మరియు పెద్ద 11.2 బాస్ బూస్ట్ డ్రైవర్స్ (స్పీకర్లు) తో తీసుకొచ్చింది.ఈ డిజో నెక్ బ్యాండ్ అందమైన డిజైన్ మరియు ఆకర్షణీయమైన కలర్ అప్షన్ లలో కూడా లభిస్తుంది. దీనిని కేవలం రూ.999 రూపాయల స్పెషల్ లాంచ్ ఆఫర్ ధరతో ప్రకటించింది. ఈ నెక్ బ్యాండ్ ఫస్ట్ సేల్ ఫిబ్రవరి 25వ తేదీ మధ్యాహ్నం 12 గంటలకు Flipkart నుండి జరుగనుంది. ఈ DIZO నెక్ బ్యాండ్ క్లాసిక్ బ్లాక్, హంటర్ గ్రీన్, వయోలెట్ మరియు బ్లూ అనే మూడు అందమైన కలర్ అప్షన్ లలో లభిస్తుంది. బ్లూటూత్ నెక్ బ్యాండ్ 11.2mm డ్రైవర్స్ తో పవర్ ఫుల్ బాస్ అందిస్తుంది. క్లియర్ వాయిస్ కాల్స్ కోసం Noise Cancellation ని కూడా వుంది. ఈ నెక్ బ్యాండ్ ఒక్కసారి పూర్తి ఛార్జింగ్ తో 18 గంటల ప్లే బ్యాక్ అందిస్తుంది మరియు 10 మినిట్స్ ఛార్జింగ్ తో 2 గంటల ప్లే బ్యాక్ ను ఇస్తుంది. ఇది Bluetooth 5.2 తో వస్తుంది మరియు గేమింగ్ కోసం 88ms సూపర్ లో లెటెన్సీ ని కూడా జతచేసింది. సేఫ్టీ పరంగా ఈ నెక్ బ్యాండ్ IPX4 వాటర్ రెసిస్టెన్స్ తో వచ్చింది. 

Post a Comment

0 Comments