గాల్లో ప్రయాణం కూడా చౌక కాబోతోంది. కేవలం రూ. 12 ఖర్చు చేస్తే చాలు.. గాల్లో ప్రయాణించవచ్చు. ఈ ప్రయాణం విమానంలోనో, హెలికాప్టర్ లోనో కాదు. ఇదో కొత్త తరహా ప్రయాణం నగరాల్లో 4 సీట్ల డ్రోన్లు నడిపేందుకు సన్నాహాలు ప్రారంభం అయ్యాయి. హైదరాబాద్‌లో 'ఈవీటోల్స్' సేవలు అందుంచేందుకు జెట్ సెట్ గో ఏవియేషన్ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ విషయాన్ని ఆ సంస్థ సీఈఓ కనికా టేక్రివాల్ వివరించారు. ఈ సంస్థకు చాలా ప్రత్యేకతలు ఉన్నాయి. ఈ స్టార్టప్‌లో క్రికెటర్ యువరాజ్ సింగ్, పారిశ్రామికవేత్త పునీత్ దాల్మియా కూడా పెట్టుబడులు పెట్టారట!. ఈ జెట్‌సెట్‌గో ఏవియేషన్ సంస్థ తన విస్తరణ కార్యకలాపాల కోసం నిధులు సమీకరిస్తోంది. కనీసం రూ.1500 కోట్ల నిధులు సమీకరించాలని ప్లాన్ చేస్తున్నారు. నగరాల్లో ట్రాఫిక్ సమస్య పరిష్కారం కోసం ఈవీ టోల్స్ సేవలు అందించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఈ భారీ డ్రోన్లలో పైలట్ అంటూ ఎవరూ ఉండరు. ప్రస్తుతం కెమేరా డ్రోన్లు ఎలా పని చేస్తున్నాయో.. ఇవీ అలాగే.. కాకపోతే ఇవి సైజ్‌లో భారీగా ఉంటాయన్నమాట. ఈ భారీ డ్రోన్లలో ఒకేసారి నలుగురు ప్రయాణించే సదుపాయం ఉంది. వీటినే ఈవీ టోల్స్ అంటున్నారు. ఈ భారీ డ్రోన్లను ఓసారి ఛార్జింగ్ చేస్తే 40 కిలోమీటర్లు ప్రయాణించవచ్చట. అంటే ఒక కిలోమీటరుకు ఒక్కో వ్యక్తికి రూ.12 ఖర్చు అవుతుందట. ఇదేదో బావుంది కదా. ఎయిర్‌బస్ వంటి కొన్ని సంస్థలు ఈ డ్రోన్లను తయారు చేస్తున్నాయి. వీటి సేవలను త్వరలో హైదరాబాద్‌లో ప్రారంభించేందుకు ఈ సంస్థ ప్రయత్నిస్తోంది. ఇప్పటికే కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలతో చర్చలు జరుపుతోంది.
0 Comments