Ad Code

సింగిల్ ఛార్జ్‌తో 499 కిలోమీటర్లు


ఓ వైపు ఇంధన ధరల పెంపు, మరోవైపు పర్యావరణ కాలుష్యం కారణంగా ఎలక్ట్రిక్​ వాహనాలకు డిమాండ్​ పెరిగింది. దీంతో, ప్రముఖ కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్​ వాహనాల తయారీపై దృష్టి పెడుతున్నాయి. ఇప్పటికే అనేక కార్ల తయారీ సంస్థలు ఎలక్ట్రిక్​ మార్కెట్​లోకి అడుగు పెట్టాయి. దీంతో, దక్షిణ కొరియా కియా మోటార్స్​ అతి త్వరలోనే తన తొలి ఎలక్ట్రిక్ వాహనాన్ని విడుదల చేసేందుకు సిద్దమవుతోంది. ప్రస్తుత సమాచారం ప్రకారం, ఈ సంవత్సరం భారతదేశంలో కియా మోటార్స్​ తన EV6 ఎలక్ట్రిక్ క్రాస్‌ ఓవర్‌ను విడుదల చేయనుంది. జూన్ 2022 మొదటి వారంలో ఈ వాహనం భారత మార్కెట్​లోకి వచ్చే అవకాశం ఉంది. కియా ఈవీ6 ఎలక్ట్రిక్​ కారును 2021లో సంస్థ ప్రకటించింది. ఇది కియాకు చెందిన మొదటి ఎలక్ట్రిక్ కారు. ఎలక్ట్రిక్​ వాహనాల కోసం ప్రత్యేకంగా రూపొందించిన ఎలక్ట్రిక్-గ్లోబల్ మాడ్యులర్ ప్లాట్‌ఫారమ్‌పై ఆధారపడి పనిచేస్తుంది. కంపెనీ చాలా సంవత్సరాలుగా సోల్, నిరో వంటి ఆల్-ఎలక్ట్రిక్ వాహనాలను విక్రయిస్తుంది. అయితే, ఇవి భారత్​లో ఇంకా అందుబాటులోకి రాలేదు. కాగా, భారత మార్కెట్​లోకి వచ్చే మొదటి కియా ఎలక్ట్రిక్​ కారు EV6 కావడం విశేషం. అయితే, కియా ఈవీ6 ఫ్లాగ్​షిప్​ లైనప్‌లోనే లభించే అవకాశం ఉంది. ఇది అత్యంత ఖరీదైనదిగా మార్కెట్​లోకి రానుంది. అయినప్పటికీ, దీనికి మంచి డిమాండ్ లభించే అవకాశం ఉందని ఆటో రంగానికి చెందిన నిపుణులు​ చెబుతున్నారు. ప్రపంచవ్యాప్తంగా EV6 మొత్తం రెండు పవర్‌ట్రెయిన్ ఆప్షన్లలో అందుబాటులో ఉంటుంది. 58 kWh బ్యాటరీ ప్యాక్, 77.4 kWh బ్యాటరీ ప్యాక్ -ఆప్షన్లలో లభిస్తుంది. తొలుత కియా EV6 కేవలం 77.4 kWh బ్యాటరీ ప్యాక్‌తో రిలీజయ్యే అవకాశం ఉంది. ఈ బ్యాటరీ 222 bhp, 350 Nm మోటారుతో వస్తుంది. సింగిల్ ఛార్జ్‌తో 499 కిమీల దదూరం ప్రయాణిస్తుంది. కియా EV6 TFT ఇన్‌స్ట్రుమెంట్ క్లస్టర్‌కు ఆనుకుని పెద్ద టచ్‌స్క్రీన్ ఇన్ఫోటైన్‌మెంట్ సిస్టమ్‌తో అందుబాటులోకి వస్తుంది. అయితే.. సెంటర్ కన్సోల్, డ్యాష్‌బోర్డ్ ఈవీ లోపల స్పష్టమైన అప్పీల్ కోసం కొన్ని ఫిజికల్ స్విచ్‌లను అందించింది. ఈవీ6లో ఆగ్మెంటెడ్ రియాలిటీ హెడ్-అప్ డిస్‌ప్లే, ఎల్​ఈడీ లైటింగ్, హీటెడ్, వెంటిలేటెడ్ ఫ్రంట్ సీట్లు, ఆన్‌బోర్డ్ పవర్ జనరేటర్ వంటి అదిరిపోయే ఫీచర్లను ఉండనున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu