Ad Code

ఏసర్ నుంచి యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్


ప్రముఖ ఎలక్ట్రానిక్స్ వస్తువుల తయారీ సంస్థ యాసెర్ ఓజోన్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్‌ని తయారుచేసింది. ఈ సరికొత్త శానిటైజర్ డివైజ్‌ను ట్యాప్‌కు అనుసంధానం చేసుకోవచ్చు. దీన్ని ఇన్‌స్టాంట్ ఓజోన్ జనరేషన్ టెక్నాలజీ ఆధారంగా తయారు చేసింది. ఈ శానిటైజర్ ఖరీదు వచ్చేసి రూ.16,999లుగా సంస్థ నిర్దేశించింది. ఈ ఉత్పత్తి వినియోగదారులకు అత్యంత స్వచ్ఛంగా, శుభ్రంగా ఉంచటమే కాకుండా బ్యాక్టిరియల్ రహితంగ ఉంచుతుందని కంపెనీ తెలిపింది.ఈ శానిటైజర్ ఇన్‌స్టంట్ ఓజోన్ జనరేషన్ టెక్నాలజీని ఉపయోగించామని, ఇది తక్షణమే ఓజోన్‌ను నీటిలో కరిగిస్తుందని యాసెర్ సంస్థ పేర్కొంది. అంతేకాకుండా ఇది ఉపరితలంపైన ఉండే సూక్ష్మీజీవులను 75 శాతం తొలగించడంలో సహాయపడుతుందని స్పష్టం చేసింది. తినదగిన పదార్ధాల షేల్ఫ్ కాలపరిమితిని 2 నుంచి 3 రెట్లు పొడిగిస్తుందని తెలిపింది. ఓజోన్ యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్‌ను ఇంట్లో ఏదైనా సాధారణ ట్యాప్‌కు జోడించే డివైజ్. ఇది ఓజోన్‌ కరిగిన నీటిని ఉత్పత్తి చేస్తుంది. ఇది తాజా ఆహారం, పాత్రలు, ఉపరితలాలు వంటి ఉత్పత్తులను శుభ్రం చేయడానికి ఉపయోగించవచ్చు. అంతేకాకుండా వాటర్ స్టెరిలైజేషన్, డియోడరైజేషన్, బ్లీచింగ్ లాంటి ప్రక్రియల ద్వారా కలిగే సంరక్షణను కూడా ఇది కలిగిస్తుంది. ఓజోనేటెడ్ వాటర్‌లో బలమైన యాంటీ బ్యాక్టీరియల్ లక్షణాలు ఉన్నాయని కంపెనీ చెబుతోంది. నీటి పాత్రలు, పాల సీసాలు. కూరగాయలు, బొమ్మలు మొదలైన వాటిని శుభ్రం చేయడానికి ఉపయోగపడుతుందని తెలిపింది. అంతేకాకుండా E.coilకి వ్యతిరేకంగా ప్రభావం చూపుతుందని, శుభ్రం చేయడానికి వాడే ఆల్కహాల్ ఆధారిత లిక్విడ్‌లను ఈ శానిటైజర్ డివైజ్ భర్తీ చేస్తుందని కంపెని తెలిపింది. పెంపుడు ద్వారా వచ్చే బ్యాక్టీరియా ఇన్ఫెక్షన్లు, ఫంగల్ ఇన్ఫెక్షన్లు, అలెర్జీలను కూడా తగ్గిస్తుందని, ఇది నిరూపితం కూడా అయిందని వెల్లడించింది. ఈ డివైజ్‌ను ఇంట్లో ఏదైనా సాధారణ ట్యాప్‌కు అమర్చవచ్చు. ఓజోనేటెడ్ నీటిని సృష్టించడానికి ఈ వస్తువు ఆటోమేటిక్‌గా పనిచేస్తుంది. అంటే ట్యాప్‌లో నుంచి వచ్చే నీటిలో ఓజోన్‌ను విడుదల చేసి.. ఓజోనేటెడ్ వాటర్‌గా మార్చుతుంది. ఆ నీరే వినియోగదారులకు విడుదల చేసి అవసరాలకు అనుగుణంగా వాడుకునేలా చేస్తుంది. ఈ సరికొత్త యాంటీ బ్యాక్టీరియల్ శానిటైజర్ డివైజ్ ఖరీదు వచ్చేసి రూ.16,999లుగా సంస్థ నిర్దేశించింది. ఈ డివైజ్‌ను ప్రముఖ ఈ కామర్స్ సైట్లు అయిన ఫ్లిప్‌కార్ట్, అమెజాన్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంది.

Post a Comment

0 Comments

Close Menu