Ad Code

గూగుల్ స్మార్ట్ వాచ్ పెట్టుకుంటే చేతులు కాలిపోతున్నాయ్


గూగుల్ కంపెనీల్లో ఒకటైన ఫిట్ బిట్ తాను తయారుచేసిన స్మార్ట్ వాచ్‌ల గురించి ఘోర అవమానం ఎదుర్కొంది. ఫలితంగా పది లక్షల వాచ్ లను వెనక్కు తీసుకోవాల్సి వచ్చింది. ఒక్క అమెరికాలోనే కాకుండా దీనిని కొనుగోలు చేసిన ఇతర దేశస్థులకు కూడా వాచ్ బ్యాటరీ వేడెక్కి చేతులు కాలడం, గాయాలవడం వంటి ఘటనలు నమోదయ్యాయట. యూఎస్ కన్జూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ బుధవారం ఫిట్‌బిట్‌పై అమెరికా నుంచి కనీసం 115మంది ఇతర దేశాల నుంచి 59మంది కంప్లైంట్ చేశారని వెల్లడించింది. చాలా మందికి సెకండ్, థర్డ్ డిగ్రీ గాయాలు అవుతున్నాయని వాపోతున్నారు. దీనిపై అధికారికంగా స్టేట్మెంట్ విడుదల చేసిన ఫిట్‌బిట్.. యూఎస్ కన్జూమర్ ప్రొడక్ట్ సేఫ్టీ కమిషన్ అనౌన్స్‌మెంట్ కు తాము 0.01 శాతం ఉత్పత్తులు మాత్రమే విక్రయించినట్లు తెలిపింది. ఇలాంటి ఘటనలు చాలా అరుదుగా జరుగుతాయి. ఫిట్‌బిట్ స్మార్ట్ వాచెస్, ట్రాకర్లతో ఇలాంటి ప్రమాదాలు జరగవని సర్ది చెప్పుకుంది. అమెరికాలో పది లక్షల వాచ్ లు రీకాల్ చేస్తుండగా.. ప్రపంచవ్యాప్తంగా 6లక్షల 93వేల వాచ్ లను అమ్మారట. దీనిపై స్పందించిన నియంత్రణ కమిటీ Fitbit Ionic స్మార్ట్‌వాచ్‌ని వాడొద్దని చెప్పింది. వాళ్ల వాచ్ లు తిరిగిచ్చేసిన తర్వాత వాటికి రీఫండ్ దొరుకుతుందని స్పష్టం చేసింది.

Post a Comment

0 Comments

Close Menu