Ad Code

జెకె నుంచి పంక్చర్ గార్డ్ టైర్స్!


భారతదేశంలో టైర్ మార్కెట్‌ శరవేగంగా విస్తరిస్తుంది. మనదేశంలో ముడి రబ్బరు లభ్యత సంవృద్ధిగా ఉండటంతో ఇక్కడ తయారైన టైర్లు విదేశాలకు కూడా ఎగుమతి చేయబడుతున్నాయి. మారుతున్న టెక్నాలజీకి అనుగుణంగా ఇప్పుడు కొత్త రకం టైర్లు కూడా మార్కెట్లోకి వస్తున్నాయి. ప్రముఖ దేశీయ టైర్ తయారీ సంస్థ జెకె టైర్ అండ్ ఇండస్ట్రీస్ సరికొత్త పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో కూడిన టైర్లను మార్కెట్లో విడుదల చేసింది. జెకె టైర్ నాలుగు చక్రాల వాహనాలలో ఉపయోగించే భారతదేశపు మొట్టమొదటి పంక్చర్ గార్డ్ టైర్ ను పరిచయం చేసింది. ఈ పంక్చర్ గార్డ్ టైర్లు భారతీయ రహదారి పరిస్థితులకు అనుకూలంగా ఉండే అధిక పనితీరు గల టైర్లు అని కంపెనీ తెలిపింది. టైర్ల తయారీలో అత్యాధునిక సాంకేతిక నైపుణ్యంతో పనిచేసే జెకె టైర్, మార్కెట్లో అందుబాటులో ఉన్న కొత్త తరం కార్ల కోసం ఈ పంక్చర్ గార్డ్ టైర్లతో పరిశ్రమలో విప్లవాత్మక మార్పులు తీసుకురావాలని లక్ష్యంగా పెట్టుకుంది. జెకె పంక్చర్ గార్డ్ టైర్ లోపలి భాగం ప్రత్యేకంగా రూపొందించబడిన సెల్ఫ్ హీలింగ్ ఎలాస్టోమర్ కోటింగ్‌తో వస్తుంది. ఈ సాంకేతికతతో టైర్ 6 మిమీ వ్యాసం కలిగిన పదునైన వస్తువుల వల్ల కలిగే పంక్చర్‌ లను దానంతట అదే ఆటోమేటిక్ గా రిపేరు చేయగలదు. ఇలా ఒకటి లేదా రెండు కాదు, ఒకేసారి అనేక పంక్చర్లను కూడా రిపేర్ చేయగలదు. అన్ని రకాల రోడ్లపై సురక్షితమైన ప్రయాణాన్ని నిర్ధారించడానికి, కంపెనీ భారతీయ ఆన్-రోడ్ మరియు ఆఫ్-రోడ్ పరిస్థితులలో ఈ పంక్చర్ గార్డ్ టైర్‌ ను పరీక్షించింది. ఈ టైర్లను మార్కెట్లో లాంచ్ చేసే సమయంలో కూడా కంపెనీ డెమోగా టైర్లను మ్యాన్యువల్ గా పంక్చర్ చేసి చూపించింది. ఆ సమయంలో టైర్లలో ఎన్ని మేకులు గుచ్చుకున్నప్పటికీ, టైర్ల నుండి గాలి మాత్రం బయటకు రాలేదు. పంక్చర్ గార్డ్ టెక్నాలజీతో కూడిన టైర్లు, సదరు టైరు యొక్క జీవితకాలం ముగిసే వరకు ఎలాంటి అవాంతరాలు లేని రైడ్‌ ను అందిస్తుందని, దీని వలన టైర్లలో కూడా గాలి కూడా తగ్గిపోదని కంపెనీ తెలిపింది. గడచిన 2020లో స్మార్ట్ టైర్ టెక్నాలజీని మరియు ఇప్పుడు పంక్చర్ గార్డ్ టైర్ టెక్నాలజీని ప్రవేశపెట్టడం ద్వారా తాము తమ కస్టమర్‌ లకు అధునాతన మొబిలిటీ సొల్యూషన్‌లను అందించాలనే నిబద్ధతకు కట్టుబడి ఉన్నామని, ఈ లేటెస్ట్ టెక్నాలజీ వాహన యజమానులకు అత్యున్నత స్థాయి భద్రత మరియు సౌకర్యాన్ని అందిస్తుందని జెకె టైర్ చైర్మన్ మరియు మేనేజింగ్ డైరెక్టర్ రఘుపతి సింఘానియా తెలిపారు.

Post a Comment

0 Comments

Close Menu