Ad Code

స్మార్ట్ ఫోన్ల జీవిత కాలం ఎంత?


ప్రతి స్మార్ట్ ఫోన్ నిర్ణీత జీవిత కాలాన్ని కలిగి ఉంటుంది. కాకపోతే మనం దానిని గుర్తించకపోవచ్చు. స్మార్ట్ ఫోన్ ని మనలో చాలామంది రెండు లేదంటే మూడేళ్లకు ఒకసారి మారుస్తుంటారు. మరికొందరు మాత్రం కొద్దినెలల్లోనే మారుస్తుంటారు. నిజానికి స్మార్ట్ ఫోన్ ని ఎప్పుడు మార్చాలనేది ఆ ఫోన్ కు వచ్చే అప్ డేట్స్ మీద ఆధారపడి ఉంటుంది. నిజానికి ప్రతి ఆరు నెలలకు ఒకసారి మన స్మార్ట్ ఫోన్ ను మార్చాల్సి ఉంటుంది. కానీ జాగ్రత్తగా ప్రతి అప్ డేట్ ని చేసుకుంటూ ఫోన్ ని అప్ గ్రేడ్ చేసుకోవాలి. స్మార్ట్ ఫోన్ బాగా పని చేయాలంటే అప్ డేట్ అవడం తప్పనిసరి అని గుర్తించాలి. స్మార్ట్ ఫోన్ లకు అప్ డేట్స్ ఎంత తరుచుగా వస్తుంటాయి? ఏ కంపెనీ ఫోన్ ఎక్కువ కాలం వచ్చేలా అప్ డేట్స్ ని అందిస్తుందనే విషయం తెలసుకోవాలి.

శాంసంగ్: ఇండియన్ ఫోన్ మార్కెట్లో భారీ వాటాను కలిగి ఉన్న శాంసంగ్ కంపెనీ తమ ఫోన్లకు ఐదేళ్ల వరకు అప్ డేట్స్ ఇస్తోంది. శాంసంగ్ స్మార్ట్ ఫోన్లకు మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ లభిస్తాయి.

వన్ ప్లన్ మరియు ఒప్పో: వన్ ప్లస్ ఫోన్లకు మూడేళ్ల వరకు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, నాలుగేళ్ల వరకు సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తున్నట్లు ఆ కంపెనీ ప్రకటించింది. అటు ఒప్పో కూడా దాదాపు ఇదే తరహాలో అప్ డేట్స్ ఇస్తోంది.

నోకియా:  నోకియా తమ స్మార్ట్ ఫోన్లకు మూడేళ్ల అప్ డేట్స్ ఇస్తుండగా, నోకియా నుండి వచ్చిన జీ సిరీస్ స్మార్ట్ ఫోన్లకు మాత్రం రెండేళ్ల పాటు అప్ డేట్స్ ఇస్తోంది.

షియామీ: ఇది కూడా మూడేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్ ని ఇస్తోంది. ఇక సెక్యూరిటీ అప్ డేట్స్ నాలుగేళ్ల పాటు అందుతున్నాయి.

రియల్ మీ : రెండేళ్ల పాటు ఆండ్రాయిడ్ అప్ డేట్స్, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ఇస్తోంది.

మోటోరోలా, మైక్రోమ్యాక్స్, ఐకూ: మార్కెట్లో లభించే ఐకూ, మోటోరోలా, మైక్రోమ్యాక్స్ కంపెనీలు తమ ఫోన్లకు రెండేళ్లపాటు సాఫ్ట్ వేర్ అప్ డేట్స్ ని, మూడేళ్ల పాటు సెక్యూరిటీ అప్ డేట్స్ ని ఇస్తున్నాయి.

Post a Comment

0 Comments

Close Menu