Ad Code

ఎలక్ట్రిక్ వాహన ధరలు పెరుగుతాయా?


పెట్రోల్, డీజిల్ ధరలు రోజురోజుకు పెరుగుతున్న క్రమంలో ఎలక్ట్రిక్ వాహనాల కొనుక్కోవడానికి చాలా మంది ఆసక్తి చూపుతున్నారు. ఈ వాహనాల ధరలను పెంచేందుకు కంపెనీలు దృష్టి సారిస్తున్నాయని నిపుణులు వెల్లడిస్తున్నారు. దీనికంతటికి కారణం రష్యా – ఉక్రెయిన్ దేశాల మధ్య జరుగుతున్న యుద్ధమే కారణమని విశ్లేషిస్తున్నారు. యుద్ధం కారణంగా.. దిగుమతి చేసుకున్న బ్యాటరీల ధరలు పెరుగుతున్నాయి. ఈవీ బ్యాటరీ సెల్స్ ధర రూ. 130 డాలర్లు లేదా అంతకంటే ఎక్కువగానే పెరిగినట్లు కౌంటర్ పాయింట్ రీసెర్చ్ ఇండియా ఆటోమోటివ్ సీనియర్ రీసెర్చ్ అనలిస్టు సౌమెన్ మండల్ వెల్లడిస్తున్నారు. సరఫరాలో అంతరాయం ఏర్పడడం, అంతర్జాతీయంగా నెలకొన్న పరిస్థితుల కారణంగా ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లు ఆయన అంచనా వేస్తున్నారు. ఓలా ఎన్ 1 స్కూటర్  లో 2.98 కిలోవాట్ బ్యాటరీ ఉంటుందని, ఏథర్ 450 ఎక్స్ లో 2.61 కిలోవాట్ల బ్యాటరీ ఉంటుంది. ఇక దేశీయంగా తయారవుతున్న అథర్ ఎనర్జీ  450X స్కూటర్ ధరలను జనవరిలో 3 శాతం లేదా రూ. 5,500 కంటే ఎక్కువగానే పెంచిన విషయం తెలిసిందే. ఓలా S1pro ఎలక్ర్టిక్ స్కూటర్ ధరలను పెంచనున్నట్లు కంపెనీ ఎలక్ట్రిక్ ఎగ్జిక్యూటివ్ భవిష్ అగర్వాల్ వెల్లడించారు. మార్చి 17న పెంచిన ధరలను అమల్లోకి వచ్చాయి. బ్యాటరీ సెల్స్ తయారీ, ఇందుకు అవసరమైన ముడి పదార్థాల ధరలు, వాణిజ్య ఆంక్షల కారణంగా..ఇతరత్రా వాటి కారణంగా ధరలు పెరిగాయని గ్రేటర్ నోయిడాకు చెందిన బ్యాటరీ తయారీ దారు లోహమ్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ రజత్ వర్మ తెలిపారు. చైనా, తైవాల్, కొరియా దేశాల్లో ప్రధాన సెల్ తయారీ దేశాల్లో బ్యాటరీ సెల్ ధరల పెరుగుదలకు కారణమయ్యాయని తెలిపింది. గత రెండు నెలల్లో 30 శాతం పెరిగాయని వెల్లడించారు. 

Post a Comment

0 Comments

Close Menu