Ad Code

ఇన్‌స్టాగ్రామ్‌లో మీ ఈమెయిల్ ఐడీ మార్చాలా?


మెటా లోని ఫొటో-షేరింగ్ ప్లాట్‌ఫారమ్ ఇన్‌స్టాగ్రామ్ పాపులర్ సోషల్ మీడియా యాప్. ఎప్పటికప్పుడు కొత్త ఫీచర్స్‌తో ఈ యూజర్లను ఆకట్టుకోవడంలో ఇన్‌స్టాగ్రామ్ ప్రయత్నిస్తుంది. ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఓపెన్ చేసేటప్పుడు ఈమెయిల్ ఐడీ అవసరం అయితే ఇన్‌స్టాగ్రామ్‌కి మీరు ఉపయోగించిన ఈ మెయిల్‌ను మార్చడంలో ఏదైనా ఇబ్బంది ఎదుర్కొంటుంటే కొన్ని సులభంగా మీ ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్ ఈమెయిల్‌ను మార్చుకోవచ్చు. ఇన్‌స్టాగ్రామ్ ప్రొఫైల్‌కు వెళ్లి ఎడిట్ ప్రొఫైల్ ఆప్షన్ ఎంచుకోవాలి.  ఈ- మెయిల్ చిరునామా సెలెక్ట్ చేసుకొని  ఈ-మెయిల్‌ను సవరించండి, యాక్సెస్ చేయాలనుకుంటున్న కొత్తదాన్ని జోడించండి. కొత్త ఈ-మెయిల్ చిరునామాను నిర్ధారించిన తర్వాత, మీకు నిర్ధారణ ఇమెయిల్ వస్తుంది, దాన్ని తెరిచి మెయిల్‌ను నిర్ధారించండి. మై యాక్టివిటీ అనే ఫీచర్‌ తో సహా అనేక ఫీచర్లు ఇన్‌స్టాగ్రామ్‌లో అందుబాటులోకి రానున్నాయి. గత ఏడాది చివరలోనే ఇన్‌స్టాగ్రామ్‌లో తమ యాక్టివిటీని ఒకే చోట చూసేలా ఒక కొత్త ఎక్స్ పీరియన్స్ అందించేందుకు ఆయా ఫీచర్లను టెస్టింగ్ చేయడం ప్రారంభించినట్టు కంపెనీ తన బ్లాగ్‌పోస్ట్‌లో తెలిపింది. 'MY Activity'గా పిలిచే ఈ కొత్త ఎక్స్ పీరియన్స్ అందరికీ అందుబాటులోకి వస్తుందని తెలిపింది. ఈ కొత్త ఫీచర్ ద్వారా ఇన్ స్టా యూజర్లు తమ కంటెంట్‌ కు సంబంధించి కామెంట్లు, రియాక్షన్లను తేదీల వారీగా సెట్ చేసుకోవచ్చు. అలాగే ఫిల్టర్ చేసుకోవచ్చు. గతంలోని కామెంట్లు, లైక్స్, స్టోరీల రిప్లయ్ వంటి వాటిని ఒకే చోట సెర్చ్ చేసుకోవచ్చు. డిలీట్ చేసిన లేదా ఆర్కైవ్ చేసిన కంటెంట్‌ను కూడా ఇన్‌స్టా యూజర్లు.. సెర్చ్ హిస్టరీ ద్వారా సెర్చ్ చేసుకోవచ్చు. ఆయా లింక్‌లను ప్లాట్‌ఫారమ్‌లో సెర్చ్ చేసి డౌన్‌లోడ్ (Download) డేటాను చూసేందుకు కూడా ఈ ఫీచర్ వినియోగించుకోవచ్చు. గతంలో ఇన్ స్టా కంపెనీ.. యూజర్ల అకౌంట్ హ్యాక్ అయిన వ్యక్తులకు 'సెక్యూరిటీ చెకప్'ను ప్రవేశపెట్టింది. అంతే కాకుండా ఆండ్రాయిడ్, ఐఓఎస్ యాప్ యూజర్ల కోసం క్విక్ షేర్  ఫీచర్‌ను ఇన్‌స్టాగ్రామ్ విడుదల చేసింది. ఈ కొత్త ఫీచర్ సాయంతో యూజర్లు ఏదైనా ఫొటో, వీడియో లేదా రీల్స్‌ను తాము ఎక్కువగా ఇంటరాక్ట్ అయిన కాంటాక్ట్‌కి నేరుగా షేర్ చేసుకోవచ్చు. యూజర్లు ఇన్‌స్టాగ్రామ్ పోస్టుల కింద ఉన్న సెండ్ కీలో ఈ ఫీచర్‌ను కనుగొనవచ్చు. ప్రస్తుతానికి ఈ ఫీచర్ సెలెక్టెడ్ యూజర్లకు అందుబాటులోకి వచ్చింది.

Post a Comment

0 Comments

Close Menu