Ad Code

కార్ పార్క్ చేస్తే చాలు ఛార్జ్ అవుతుంది!


వైర్‌లెస్‌ చార్జింగ్‌ కార్లపైనే వోల్వో కార్ల కంపెనీ ప్రయోగాలు చేస్తోంది. కొత్త కార్లను మార్కెట్‌లోకి తీసుకొచ్చేందుకు రెడీ అవుతుంది. అసలు ఇక పార్కింగ్‌ ప్లేస్‌లో పెడితే కార్లు ఎలా చార్జింగ్‌ అవుతాయి? దాని వెనకుండే మెకానిజం ఏంటి అలాగే వైర్‌లెస్‌ చార్జింగ్‌తో కలిగే ఉపయోగాలేంటి? ఈ కారు ఎలా చార్జ్‌ అవుతుంది? కారును చార్జ్‌ చేసేందుకు చార్జింగ్‌ స్టేషన్‌లలో ఏర్పాటు చేసిన చార్జింగ్‌ ప్యాడ్‌ పై కార్ పార్క్‌ చేయాలి.ఆ చార్జింగ్‌ ప్యాడ్‌ నుంచి కారుకు విద్యుత్‌ శక్తి అందుతుంటుంది. ఆ శక్తిని గ్రహించి బ్యాటరీని చార్జ్‌ చేయడానికి కారు భాగంలో ముందు టైర్ల దగ్గర రిసీవర్‌ అనేది ఉంటుంది.కారులో ఉండే 360 డిగ్రీ కెమెరాతో డ్రైవర్‌ కారు రిసీవర్‌ను కరెక్ట్ గా చార్జింగ్‌ ప్యాడ్‌పైకి తీసుకురావొచ్చు. స్వీడన్‌లోని గోథెన్‌బర్గ్‌ సిటీలో గత మూడు సంవత్సరాలుగా ఈ వైర్‌లెస్‌ చార్జింగ్‌ ప్రయోగాలను వోల్వో చేస్తోంది. దీని కోసం వోల్వో ఎక్స్‌సీ40 ఎస్‌యూవీ ఎలక్ట్రిక్‌ ట్యాక్సీలను వాడుతోంది. అలాగే వోల్వో వైర్‌లెస్‌ చార్జింగ్‌ శక్తి దాదాపు 40 కిలోవాట్లు ఉంటుంది. అంటే 11 కిలోవాట్ల ఏసీ వైర్డ్‌ చార్జర్‌తో కంపేర్ చేస్తే 4 రెట్లు వేగంగా కారు చార్జ్‌ అవుతుంది. అలాగే 50 కిలోవాట్ల డీసీ వైర్డ్‌ చార్జర్‌తో ఎంత వేగంగానైతే కారు చార్జ్‌ అవుతుందో అంతే వేగంతో వైర్‌లెస్‌తో చార్జ్‌ కూడా చేయొచ్చు. అలాగే రోజుకు 12 గంటలు, ఏడాదికి లక్ష కిలోమీటర్లు తిరిగినా వాహనం ఎంతో మన్నికగా ఉంటుంది. వైర్‌లెస్ ఇంకా ఎలక్ట్రిక్‌ కాబట్టి ఇది పర్యావరణ హితం కూడా. పైగా కేబుల్‌తో చార్జ్‌ చేసే అవసరం కూడా ఉండదు. పెట్రోల్ ఇంకా డీజిల్‌ ధరలు ఆకాశాన్ని తాకుతుండటంతో ప్రజలు ఎలక్ట్రిక్‌ కార్ల వైపు మొగ్గుచూపుతున్నారు. ఎక్కడంటే అక్కడ చార్జింగ్‌ పెట్టుకునే సౌకర్యం లేకపోవడం వల్లే వాహనదారులు ఎలక్ట్రిక్‌ వాహనాలను కొనేందుకు వెనుకడుగు వేస్తున్నారు. వోల్వో లాంటి కార్ల కంపెనీల కొత్త చార్జింగ్‌ టెక్నాలజీలతో ఇలాంటి మైనస్‌లకు చెక్‌ పడుతుందో లేదో వేచి చూడాలి.

Post a Comment

0 Comments

Close Menu